చెర్రీకి వరంలా మారిన పవర్ స్టార్ తిరస్కరణ?

By Bojja Kumar

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరస్కరిస్తూ తీసుకున్న నిర్ణయం రామ్ చరణ్ తేజకు వరంలా మారిందా? ఆ కారణంగానే చరణ్ కెరీర్లో 'నాయక్' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వచ్చి చేరిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'నాయక్' సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించడంతో పాటు...ఫస్ట్ వీక్ కలెక్షన్ల విషయంలో ఆల్ టైం రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా నాయక్ సినిమాపై ఓ రూమర్ చెక్కర్లు కొడుతోంది. వాస్తవానికి 'నాయక్' సినిమా రామ్ చరణ్‌ను దృష్టిలో పెట్టుకుని తయారు చేయలేదని, దాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసారని, ముఖ్యంగా సినిమాలోని కోల్‌కతా బ్యాగ్రౌండ్ పవన్ కళ్యాణ్ గత సినిమాల ఆధారంగా.....కథా రచయిత ఆకుల శివ తయారు చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టును తిరస్కరించడంతో పాటు...ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారించాడని, దీంతో దర్శకుడు వినాయక్ ఈ కథను రామ్ చరణ్ తో ఓకే చేయించాడని, ఆ విధంగా డివివి దానయ్య నిర్మాణ సారథ్యంలో 'నాయక్' చిత్రం తెరకెక్కిందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ కథ మెగా హీరోల ఖాతాలోకి చేరి హిట్ కావడంపై మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

భవిష్యత్ లో ఎలాగైనా పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనే పట్టుదలతో ఉన్న దర్శకుడు వివి వినాయక్ పవన్ కళ్యాణ్ మెచ్చే కథల కోసం అన్వేషిస్తున్నాడని, ఎలాగైనా పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే చాన్స్ దక్కించుకుంటాననే కసితో ముందుక సాగుతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X