సేమ్ స్టెప్ కాపీ కొట్టిన రామ్ చరణ్!
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలో 'నాయక్' చిత్రం ద్వార ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్, అమల పాల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటించిన 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్నా' అనే గీతాన్ని రీమిక్స్ చేశారు. అదే విధంగా మెగాస్టార్ తన సినిమాల్లో వేసిన స్టెప్టులను ఉన్నది ఉన్నట్లు కాపీ కొట్టి మెగా అభిమానులను అలరించనున్నాడు రామ్ చరణ్.
ఇటీవల నాయక్ చిత్రానికి సంబంధించిన కొన్ని వాల్ పోస్టర్లు విడుదలయ్యాయి. ఇందులో ఓ పోస్టర్ పై చెర్రీ ఫోజు....'అందరి వాడు' చిత్రంలో చిరంజీవి వేసిన స్టెప్పును పోలి ఉండటం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. 'నాయక్' చిత్రం ద్వారా చర్ మరోసారి మెగాస్టార్‌ను గుర్తు చేయనున్నాడని చర్చించుకుంటున్నారు.
ఇక సినిమా వివరాల్లోకి వెళితే...ఈ నెల 14వ తేదీన శిల్పకళా వేదికలో ఆడియో విడుదల కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. యూనివర్సల్ మీడియా సంస్థ 'నాయక్' చిత్రాన్ని నిర్మిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత.
ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్‌రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











