రామ్ చరణ్ ‘నాయక్’...ఓ పనైపోయింది!
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నాయక్' చిత్రం శర వేగంగా పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా హీరో రామ్ చరణ్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ఫినిష్ చేసాడు. ఇటీవల రామ్ చరణ్-చార్మిలపై చిత్రీకరించి ఐటం సాంగుతో షూటింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తుండగా....ఆ రెండు పాత్రల సరసన కాజల్, అమలపాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. మెగా అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ తో దర్శకుడు వినాయక్ పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా దీన్ని రూపొందించారు.
సంక్రాంతి పడగను పురస్కరించుకుని జనవరి 9న 'నాయక్' చిత్రం గ్రాండ్‌గా విడుదలవుతోంది. అయితనే 'నాయక్' టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గిరిజన విద్యార్థి ఆందోలనకు సిద్ధం అవుతున్న తరుణంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠ సైతం నిర్మాతలు, అభిమానుల్లో నెలకొంది.
వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న నాయక్ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











