నాయక్’ డైలాగ్స్ సెన్సేషన్, బి-టౌన్లో మరో రికార్డ్
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా వివి వినాయక్ కాంబినేషన్లో రూపొందుతున్న 'నాయక్' చిత్రం విడుదలకు ముందే రికార్డులు, సెన్సేషన్ సృష్టిస్తోంది. 'నాయక్' థియేట్రికల్ రైట్స్ పరంగా ఇప్పటికే పలు ఏరియాల్లో రికార్డు స్థాయి ధరకు అమ్ముడు పోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం హిందీ శాటిలైట్ రైట్స్ విషయంలో మరో రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రం అమ్ముడు పోని విధంగా రూ. 3.5 కోట్లుకు అమ్ముడయింది. ప్రస్తుతం రామ్ చరణ్ హిందీలో 'జంజీర్' చిత్రం చేస్తున్న నేపథ్యంలో 'నాయక్' చిత్రం శాటిలైట్ రైట్స్ ఇంత భారీ మొత్తంలో పలికాయని అంటున్నారు.
మరో వైపు 'నాయక్'చిత్రంలో డైలాగులు కొన్ని బయటకు లీకయి సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. 'ఏరియాని బట్టి మారడానికి ఇది క్లైమేట్ కాదు...కవరేజ్', 'ప్రభుత్వం కోసం ప్రజలు ఉండ కూడదు...ప్రజల కోసం ప్రభుత్వం ఉండాలి' అనే డైలాగులు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తుండగా....ఆ రెండు పాత్రల సరసన కాజల్, అమలపాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. మెగా అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ తో దర్శకుడు వినాయక్ పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా దీన్ని రూపొందించారు.
వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న నాయక్ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











