హాట్ టాపిక్ : రామ్ చరణ్ 'నాయక్' వీడియో లీక్...పెద్ద తలనొప్పి
హైదరాబాద్ : రామ్ చరణ్ తేజ తాజా చిత్రం నాయక్ లో ఓ పాట ఫుల్ వీడియో నెట్ లో దర్శనమిచ్చి అందరినీ షాక్ కి గురి చేసింది. దాంతో వెంటనే ఎలర్టైన నాయక్ టీమ్ ఆ డ్యామేజ్ కంట్రోల్ లో పడినట్లు సమాచారం. ఈ పాట ప్రత్యేకంగా చరణ్ కోసమని కట్ చేసి పంపిన వీడియో అని తెలుస్తోంది. ఎలా బయిటకి వెళ్ళి నెట్ కి ఎక్కిందో అనేదే ఇప్పుడు అందరిలోనూ ప్రశ్న.
ట్రైలర్ లో వదిలిన లైలా లైలా పాట తాలూకూ ఫుల్ వీడియో నెట్ లో కనిపించటం మెగాభిమానులను షాక్ కు గురి చేసింది. ఆ పాటలో చరణ్ వేసిన అద్బుతమైన స్టెప్స్ కు విజిల్స్ వేయాలా లేక రిలీజ్ కాకముందే ఇలా లీకైనందుకు బాధపడాలో అర్దంకానీ పరిస్ధితి ఏర్పడింది. ఇప్పటికే చాలా చోట్ల ఆ పాటకు సంభందించిన లింక్ లు కట్ చేసినా, చాలా చోట్లకు ఇది పాకిపోయింది. డౌన్ లోడ్ చేసుకున్నవారు..దాన్ని మళ్లీ అప్ లోడ్ చేస్తున్నారు.
రామ్ చరణ్ కెరీర్ లోనే అద్బతంగా స్టెప్స్ వేసిన సాంగ్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఎవరు లీక్ చేసారో..ఏ ఉద్దేశ్యంతో లీక్ చేసారో..అసలు ఎవరు లీక్ చేసారో అనే పనిలో నాయిక్ టీమ్ పడింది. గతంలోనూ మగధీర సమయంలోనూ చిత్రానికి సంభందించిన వీడియో ఫుటేజ్ బయిటకు వచ్చి హడావిడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.
రామ్‌చరణ్ హీరోగా యూనివర్సల్ మీడియా సంస్థ 'నాయక్'చిత్రాన్ని నిర్మిస్తోంది. కాజల్, అమలాపాల్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రాన్ని జనవరి 12,2013 న అంటే సంక్రాంతికి విడుదల చేయటానికి నిర్ణయించారు.
ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్‌రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్.


Click it and Unblock the Notifications











