రామ్ చరణ్ ‘నాయక్’కి రోశయ్య హ్యాండ్!
చెన్నై: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'నాయక్'. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్రౌన్ మూవీస్ పతాకంపై నీలిశెట్టి సుబ్బు తమిళంలో ఈచిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కాట్రగడ్డ లోకేష్ సమర్పకులు. ఇప్పటికే తమిళ అనువాదానికి సంబంధించిన స్క్రిప్టు రెడీ అయింది.
తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా 'నాయక్' చిత్రం తమిళ అనువాద స్ర్కిప్టును ఆవిష్కరించారు. త్వరలో డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. కాట్రగడ్డ లోకేష్ గతంలో తెలుగులో జోడి, భద్రాచలం, చిననోడు, జర్నీ చిత్రాలను ప్రొడ్యూస్ చేసారు.
సినిమా వివరాల్లోకి వెళితే... డిసెంబర్ 15న ఆడియో విడుదల కార్యక్రమం నెక్లెస్ రోడ్లో జరుగనుంది.. తెలుగు సిని ప్రముఖలు ఈ ఆడియో లాంచ్ కు ప్రత్యేకంగా హాజరుకానున్నారు. ఇక సంక్రాంతి కానుకగా ఈచిత్రాన్ని జనవరి 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
యూనివర్సల్ మీడియా సంస్థ 'నాయక్' చిత్రాన్ని నిర్మిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











