గ్యాంగ్ లీడర్ తరహాలో ‘నాయక్’ విజయ యాత్ర... షెడ్యూల్
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయిన నేపథ్యంలో ఈ నెల 20 విజయ యాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు. ఒకే రోజు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతిల్లో పర్యటించేందుకు షెడ్యూల్ సిద్ధం చేసారు. ప్రత్యేక విమానంలో హీరో రామ్ చరణ్, దర్శకుడు వివి వినాయక్ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయా పట్టణాల్లో 'నాయక్' సినిమా ప్రదర్శితం అవుతున్న థియేటర్లను సందర్శించి సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పనున్నారు.
విజయ యాత్ర షెడ్యూల్ వివరాలు (తేదీ జనవరి 20, 2013)
1. విశాఖ పట్నంలోని విమాక్స్ థియేటర్‌కు ఉదయం 10 గంటలకు చేరుకుంటారు. అక్కడ అభిమానుల కలిసిన అనంతం గాజువాకలోని లక్ష్మి థియేటర్ కి వెళారు.
2. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు రాజమండ్రి చేరుకుని గీతా అప్సర, ఊర్వశి థియేటర్‌ను సందర్శించి అభిమానులను ఎంటర్ టైన్ చేయనున్నారు.
3. మధ్యాహ్నం 2.30 గంటలకు విజయవాడ చేరుకుని రాజ్ థియేటర్, ఆ తర్వాత అన్నపూర్ణ థియేటర్‌కి చేరుకుని అభిమానులతో ముచ్చటిస్తారు.
4. రాత్రి 7 గంటలకు తిరుపతిలోని ప్రతాప్ గ్రూఫ్ థియేటర్‌కు చేరుకుంటారు. ఇలా ఒక్క రోజులో రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాల్లో విజయయాత్ర నిర్వహించనున్నారు. గతంలో ఈ తరహాలో చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ గ్యాంగ్ లీడర్‌కు విజయ యాత్ర నిర్వహించారు.
వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన నాయక్ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా సంస్థ నిర్మించింది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ హీరోయిన్స్ గా చేసారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సుధ తదితరులు నటించారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











