"నా వాళ్ల జోలికి వస్తే నరికేస్తాను..." : రామ్ చరణ్ డైలాగ్
హైదరాబాద్ : నా జోలికి వస్తే క్షమిస్తాను కానీ...నా వాళ్ల జోలికి వస్తే నరికేస్తాను... అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగు కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్ ,వినాయిక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'నాయక్'. సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ఈ చిత్రం ఆడియో సోమవారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్ ని విడుదల చేసారు. అందులో విజిల్స్ వేయిస్తున్న డైలాగ్స్ ...
ఏరియా బట్టి మారడానికి ఇది క్లైమేట్ కాదు...కరేజ్
ప్రభత్వం కోసం ప్రజలు ఉండరు..ప్రజలు కోసమే ప్రభుత్వం ఉండాలి
నా జోలికి వస్తే క్షమిస్తాను కానీ...నా వాళ్ల జోలికి వస్తే నరికేస్తాను...
ఈ డైలాగులు విన్న వారు సినిమా ఏ రేంజిలో ఎమోషన్స్ ని పలికిస్తో అని అంచనాలు వేసుకుంటున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు చెబుతూ ''కథకి అనుగుణంగానే నాయక్ అనే పేరు ఖరారు చేశాం. రామ్‌చరణ్ పాత్ర తీరుతెన్నులు ఆయన నటించిన గత చిత్రాలకంటే భిన్నంగా ఉంటాయి..ఇది యాక్షన్ ఎంటర్టైనర్. అటు మాస్‌నీ ఇటు యువతనీ ఆకట్టుకొనే కథ ఇది ''అన్నారు
నిర్మాత డి.వివి దానయ్య మాట్లాడుతూ...'ఈ కథకు 'నాయక్' అనే టైటిల్ సరిగ్గా యాప్ట్. పక్కా మాస్ అంశాలతో పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటే అద్భుతమైన కథను ఆకుల శివ అందించారు. ఈ సినిమాకు సంభాషణలు కూడా శివే అందించడం విశేషం. తమన్ సంగీతం, చోటా కె.నాయుడు ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన బలాలు. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ సినిమా. అన్నారు.
అలాగే 'మగధీర' తర్వాత రామ్‌చరణ్, కాజల్ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. అమలాపాల్ పాత్ర కూడా కథలో కీలకమైందే. రామ్‌చరణ్ పాత్ర తీరుతెన్నులు ఇందులో వైవిధ్యంగా ఉంటాయి. ఇప్పటివరకూ కనపించని కొత్త చరణ్ మా సినిమాలో కనిపిస్తాడు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని తెలిపారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్‌రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్.


Click it and Unblock the Notifications











