త్రిష ‘నాయకి’ టీజర్ (వీడియో)
హైదరాబాద్: త్రిష కీలక పాత్రలో రూపుదిద్దుకున్న చిత్రం 'నాయకి'. ఈ సినిమా టీజర్‌ను దర్శకరత్న దాసరి నారాయణరావు, చిత్ర యూనిట్ కలిసి విడుదల చేశారు. టీజర్ లో త్రిష కత్తితో ఒకరిని చంపటం ఆశ్చర్యం కనిపిస్తుంది. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.
గొవి గోవర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గిరిధర్ మామిడిపల్లి నిర్మించారు. రఘు కుంచె సంగీతం సమకూర్చారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
80వ దశకం నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌ను గిరిధర్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా కోసం త్రిష ఓ పాట పాడనుందని తెలిసింది. 3 నిమిషాల పాటు సాగే ఈ పాటను తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ త్రిష పాడబోతున్నారని తెలిసింది.

ఈ పాటను త్వరలో రికార్డ్ చేయబోతున్నారు. తొలిసారి త్రిష పాడబోతున్న పాట ఎలా వుంటుందో తెలియాలంటే నాయకి విడుదల వరకు వేచి చూడాల్సిందే. హారర్, థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయాలని నిర్మాత గిరిధర్ సన్నాహాలు చేస్తున్నారు.
డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తోన్న త్రిషకు అభినందనలు వెల్లువెత్తాయి. తనను నమ్మి ఇలాంటి పాత్రను ఇచ్చినందుకు దర్శకుడికి థాంక్స్ చెబుతూ ఈ సినిమా ద్వారా తన కెరీర్లో మరో మంచి పాత్ర రావడం సంతోషంగా ఉందని తెలిపారు. రఘుకుంచె ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తికానుందని తెలుస్తోంది.

సత్యం రాజేశ్, కోవై సరళ, జయప్రకాశ్, గణేశ్‌వెంకట్రామన్, మనోబాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్రిష నటించిన కళావతి సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











