నయనతార హిందువుగా మారడం వెనక...
సినీనటి నయనతార రెండు రోజుల క్రితం క్రిష్టియన్ మతం నుంచి హిందూ మతంలోకి మారిన విషయం తెలిసిందే. త్వరలో ప్రభుదేవాను పెళ్లి చేసుకోబోతున్న నేపేథ్యంలో ప్రభుదేవాపై ప్రేమతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందని అంతా భావించారు. కాని అసలు రహస్యం వేరే ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. దర్శకుడు బాపు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన 'శ్రీరామ రాజ్యం" సినిమాలో నయన తార సీత పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
ప్రఖ్యాత దర్శకుడు బాపు దర్శకత్వంలో 'సీత" పాత్రలో జీవించిన నయన, షూటింగ్ జరిగినన్ని రోజులు నాన్ వెజ్ ముట్టకుండా ఎంతో పవిత్రంగా ఉందట. అలా హిందుత్వ ఆచార, వ్యవహారాలు నచ్చడంతో ఆసక్తి పెంచుకున్న నయన అన్నీ ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకుందట. పైగా తను పెళ్లి చేసుకోబోతున్న ప్రభుదేవా కూడా హిందు కావడంతో అతను కూడా సంతోషిస్తాడని నయన భావించి ఉండవచ్చు. కేరళలో పుట్టి పెరిగిన నయన తార అసలు పేరు డయాన మరియమ్ కురియన్.


Click it and Unblock the Notifications











