అంతుపట్టని నయనతార చేష్టలు
ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే తార నయనతార. అసలు నయనతార చేష్టలు ఎవ్వరికీ అంతుపట్టని విధంగా వుంటాయి. ఆ మధ్యన కోటి రూపాయలకి ఒక్క రూపాయి తగ్గినా నటించనని తమిళంలో 'పయ్యా' అనే చిత్రాన్ని వదులుకున్న నయన్ ఈ మధ్యనే 'ఎలక్ర్టా' అనే మలయాళ చిత్రంలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటిస్తోందట. అలాగే ఇటీవల మణిరత్నం వంటి గొప్ప దర్శకుడి దగ్గర నుండీ పిలుపొచ్చినా సింపుల్ గా 'నో' అని చెప్పేసిందట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి.
ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే తాజాగా నయన్ బాలీవుడ్ నుండీ వచ్చిన ఓ భారీ అవకాశాన్ని వదులుకుందట. అదీ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన నటించే అవకాశం. ఈ అవకాశం ఏ తారకు వచ్చినా ఎగిరి గంతేసినంత పనిచేసేవారు. కానీ ఎప్పుడూ భిన్నంగా ఆలోచించే నయన్ మాత్రం నిర్మొహమాటంగా 'నో' అని చెప్పేసారట.
More from Filmibeat
nayantara anjaneyulu ravi teja adurs jr ntr vvvinayak sheela akshya kumar నయనతార ఆంజనేయులు రవితేజ అదుర్స్ జూఎన్టీఆర్ వివివినాయక్ షీలా అక్షయ్ కుమార్


Click it and Unblock the Notifications











