ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న నయనతార, ఫోటో వైరల్...

నయనతార తన ప్రియుడితో యూఎస్ఏలో ఎంజాయ్ చేస్తోంది. ఇద్దరూ కలిసి దిగిన ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అయింది.

By Bojja Kumar

సౌత్ బ్యూటీ నయనతార ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత కొంత కాలం ఒంటరిగా ఉన్నా... తర్వాత తనకంటూ ఓ తోడు వెతుక్కుంది. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడుపుతోంది. కొంతకాలంగా తన ప్రియుడితో కలిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది.

ఈ ప్రేమ జంట రహస్యంగా.... చాటుమాటుగా ప్రేమకలాపాలు సాగించడం లేదు. ఈ విషయంలో ఇద్దరూ చాలా ఓపెన్‌గా ఉంటున్నారు. సినిమా ఫంక్షన్లు, ఇతర వేడుకలకు కలిసే హాజరవుతున్నారు. కొంతకాలంగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. తమ ఎఫైర్ నిజమే కాబట్టి తమ గురించి ఎన్ని వార్తలొచ్చినా పట్టించుకోవడం లేదు.

యూఎస్ఏలో ఎంజాయ్ చేస్తూ...

యూఎస్ఏలో ఎంజాయ్ చేస్తూ...

తాజాగా నయనతార, విఘ్నేష్ శివన్ కలిసి యూఎస్ఏలో ఎంజాయ్ చేస్తున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అయింది. డిఫరెంట్ హెయిర్ కలర్‌తో ఈ ఫోటోలో నయనతార చాలా అందంగా కనిపిస్తోంది.

అప్పుడే అఫీషియల్ అయింది

అప్పుడే అఫీషియల్ అయింది

గతంలో ఓనమ్, పొంగల్ పండగల సాక్షిగా.... ఇద్దరూ ప్రేమలో ఉన్నారని అఫీషియల్‌గా ఖరారైంది. గతేడాది ఓనమ్ పండగ సమయంలో రెండు మూడు రోజుల పాటు కేరళలోని నయనతార ఇంట్లోనే గడిపాడు విఘ్నేష్. తర్వాత పొంగల్ ఫెస్టివల్‌ను ప్రియురాలితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు.

పెళ్లి వేస్ట్... సహజీవనమే బెస్ట్

పెళ్లి వేస్ట్... సహజీవనమే బెస్ట్

వీరి ప్రేమాయణం మొదలై దాదాపు రెండేళ్లు గడిచిపోయింది. ముచ్చటగా మూడో ఏడాది కూడా ఎలాంటి బ్రేకప్ లేకుండా సక్సెస్‌ఫుల్‌గా వీరి లవ్ ఎఫైర్ రన్ అవుతోంది. అయితే పెళ్లి విషయమై ఇద్దరూ ఆసక్తి చూపడం లేదు. పెళ్లి కంటే సహజీవనమే బెస్ట్ అంటూ ఎంతో హ్యాపీగా ముందుకు సాగుతున్నారు.

ఎంజాయ్ చేయడమే ముఖ్యం

ఎంజాయ్ చేయడమే ముఖ్యం

ఆ మధ్య ఓ ప్రెస్ మీట్లో పెళ్లి విషయమై విఘ్నేష్‌ను ప్రశ్నించగా.... ఆయన కళ్లలో ఏదో తెలియని గ్లో కనిపించింది. ఈ ప్రశ్నకు స్పందిస్తూ ప్రస్తుతం తన ఫోకస్ అంతా కెరీర్ మీదనే ఉందని, పెళ్లి ఆలోచన ఇప్పుడే లేదని తేల్చిచెప్పాడు. ఇలా చెప్పడం ద్వారా.... అప్పుడే పెళ్లి అనే ఊబిలో పడకుండా ఇంకా కొంతకాలం తాము జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పకనే చెప్పాడు విఘ్నేష్.

ఇద్దరూ బిజీ బిజీ

ఇద్దరూ బిజీ బిజీ

అటు నయనతారతో పాటు, ఇటు విఘ్నేష్ శివన్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. షూటింగ్ గ్యాపులో ఇద్దరూ కలిసి ఇలా విహారయాత్రల్లో సేదతీరుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X