స్విస్‌లో గోపీచంద్ - నయనతార, ప్రకాష్‌రాజ్ కీ రోల్
హైదరాబాద్: ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా, అందాల నటి నయనతార కథానాయికగా వీరిరువురి మొట్టమొదటికాంబినేషన్‌తో, సంచలన దర్శకుడు బి. గోపాల్ దర్శకత్వంలో నిర్మాత తాండ్ర రమేష్, జయబాలాజీ రియల్ మీడియా ప్రై. లిమిటెడ్ పతాకంపైన ఓ భారీ చిత్రాన్ని ఆగస్టు 16న షూటింగ్ ముహుర్తంతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షుటింగ్ సెప్టెంబర్ 3 నుంచి స్విట్జర్లాండ్‌లో మొదలైంది.
నిర్మాత తాండ్ర రమేష్, బి. గోపాల్-గోపీచంద్‌ల కాంబినేషన్‌తో నిర్మిస్తున్న తాజా చిత్రం గురించి చెబుతూ..బి. గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా నిర్మిస్తున్న మా చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ని సెప్టెంబర్ 3 నుంచి స్విట్జర్లాండ్‌లో మొదలు పెట్టామన్నారు. అక్కడి అందమైన లొకేషన్స్‌లో రచయిత శ్రీమణి రాసిన రెండు యుగళ గీతాలను గోపీచంద్, నయనతారలపైన దినేష్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నామని తెలిపారు.
తిరిగి సెప్టెంబర్ 25 నుంచి మరో షెడ్యూల్‌ని 20రోజుల పాటు చేయనున్నట్లు చెప్పారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లో జరిగే మరో రెండు షెడ్యూల్స్‌తో టాకీ భాగం మొత్తం పూర్తవుతుందని తెలిపారు. గోపీచంద్, నయనతార జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఓ కీలకమైన పాత్రను ప్రకాష్ రాజ్ చేస్తున్నారన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: బాల మురుగన్. నిర్మాత: తాండ్ర రమేష్, దర్శకత్వం: బి. గోపాల్.


Click it and Unblock the Notifications











