హాట్‌ హీరోయిన్‌ నయనతార

By Staff

పరమపద సోపానపఠం లాంటి చిత్రసీమలో ఎవరెప్పుడు నిచ్చెనలెక్కుతారో, ఎప్పుడు పాము పొట్టలో పడి కిందపడిపోతారో వూహించడం కష్టం. వరుసగా హిట్లిచ్చి ఉన్నట్టుండి మాయమైపోయే హీరోయిన్లు చాలామంది ఉన్నా.. కేవలం అదృష్టాన్నే కాకుండా అందాన్ని, అభినయాన్ని జోడిస్తూ ప్రేక్షకుల మది దోచుకునే తారలు చాలా తక్కువే ఉంటారు. అలాంటి వారిలో లేటెస్ట్‌ సెన్సేషన్‌ - ఈ మళయాల భామ - నయనతార.

బాస్‌ - ఐ లవ్‌ యూ చిత్రంలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించి అందరి మన్ననలు పొందుతున్న అందాల తార నయనతార ఇండస్ట్రీలో ఇప్పుడు తాజా క్రేజ్‌ అయిపోయింది. ఆమె ఇటీవల నటించిన లక్ష్మీ చిత్రం సూపర్‌ హిట్‌ కావడంతో, వెంటనే నాగార్జున వంటి హీరో సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ఆ తర్వాత ప్రభాస్‌తో ప్రస్తుతం ఈశ్వరి ఫిలింస్‌ పతాకంపై నిర్మిస్తున్న యోగి చిత్రంలో కూడా నయనతార తన అందాలతో ప్రేక్షకులకు కనువిందు చేయబోతోంది. పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్లలోనే సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన చంద్రముఖిలో నటించే అవకాశం కొట్టేసిన నయనతారను అంతా లక్కీ హీరోయిన్‌ అన్నారు. లక్ష్మీ హిట్‌ కావడంతో ఆమెది గోల్డెన్‌ లెగ్‌ అన్నారు. కానీ తనది కేవలం అదృష్టమే కాదని, టాలెంట్‌ కూడా ఉందని అన్ని చిత్రాలలోనూ రుజువు చేస్తూ వచ్చింది నయనతార. అందుకనే ఇప్పుడు మరో కొత్త అవకాశం ఆమె తలుపు తట్టింది.

క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ కొత్త సినిమాలో రవితేజ సరసన నటించే అవకాశాన్ని నయనతార దక్కించుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో రాఖీ చిత్రం తీస్తున్న కృష్ణవంశీ ఆ ప్రాజెక్టు తర్వాత వెంటనే చేపట్టే రవితేజ, నయనతార కాంబినేషన్‌ చిత్రానికి నిర్మాత సుంకర మధుమురళి. అటు తెలుగు, ఇటు తమిళం, మళయాల భాషల్లో అగ్రశ్రేణి హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న నయనతార డైరీ మరో రెండేళ్ల వరకూ ఫుల్‌.

మరిన్నికథనాలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X