నయనతార "బికినీ గుట్టు" రట్టు
బికినీలు ధరించాల్సిన పాత్రల విషయంలో నయనతార ఇటీవల బెట్టుగా ఉండడంతో ప్రతిష్టాత్మక కన్నడ చిత్రంలో ఆమె అవకాశం కోల్పోయినట్టు తెలుస్తోంది. కన్నడ సీనియర్ హీరో రవిచంద్రన్ తో 'కీచక' చిత్రంలో నటించేందుకు నయనతార కొద్దిరోజుల క్రితం అంగీకరించింది. గత ఆదివారం బెంగుళూరులో ఈ చిత్రం ప్రారంభోత్సవానికి నయనతార హాజరు కావలసి ఉంది కూడా. నయనతార పాత్ర గురించి రవిచంద్రన్ ఫోనులో చెప్పారనీ, కథ, తన పాత్ర నచ్చడంతో ఆమె సైతం ఆ ప్రాజెక్ట్ లో నటించేందుకు ఎంతో ఆసక్తి చూపించిందనీ నిర్మాత మునిరత్నం సైతం చెప్పుకొచ్చారు.
అనూహ్యంగా ఇప్పుడు నయనతార ప్లేస్ లో మరో హీరోయిన్ కోసం ఆయన అన్వేషిస్తున్నారని సమాచారం. అందాల ప్రదర్శనకు కానీ, బికినీ ధరించేందుకు కానీ నయనతార సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణమట. 'సినిమా సబ్జెక్ట్ కు ఆమె సరిపోదనుకుంటే ఆ పాత్రకు సరిపోయే మరొకరికి ఎంపిక చేయమని దర్శకుడు సూచించారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం' అని మునిరత్నం చెప్పినట్టు కన్నడ సినీ పత్రికల కథనం.


Click it and Unblock the Notifications











