నయనతార మ్యాజిక్ వర్కవుట్ అవుతుందా? తక్షణ కర్తవ్యం అదేనట..
నయనతార ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వం లో శివ లింగ, విక్రమ్ వేధా లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్ రవీంద్రన్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తంగా ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై తమిళంలో ఇటీవలే విడుదలై సూపర్ హిట్గా నిలిచిన అరమ్ చిత్రాన్ని తెలుగు లో కర్తవ్యం పేరుతో విడుదల చేస్తున్నారు. తమిళంలో ఈ చిత్రం ఊహించని విధంగా ఓ మ్యాజిక్ విజయాన్ని అందుకొన్నది.
Recommended Video


నయనతారకు క్రిటిక్స్ పశంసలు
కర్తవ్యం చిత్రం పొలిటికల్ డ్రామాగా రూపొందింది. నయనతార జిల్లా కలెక్టర్గా అద్భుతంగా నటించి మెప్పించింది. నయనతార పోషించిన పాత్రకు సినీ విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచెత్తారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కూడా కురిపించింది.

తమిళంలో సూపర్‌హిట్
ఈ సందర్భంగా ఆర్ రవీంద్రన్ మాట్లాడుతూ "తమిళం లో ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. నయనతార కెరీర్ లోనే పెద్ద విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుంది అని నమ్మకం మాకు ఉంది అని అన్నారు.

శరత్ మరార్‌తో కలిసి
తెలుగులో సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ మరియు సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు అందించిన నిర్మాత శరత్ మరార్ తో కలిసి ఈ చిత్రాన్ని విడుదల చేయటం చాల సంతోషంగా ఉంది. అని కార్యక్రమాలు పూర్తిచేసుకుని కర్తవ్యం చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం అని రవీంద్రన్ చెప్పారు.

జీబ్రాన్ సంగీత సారథ్యంలో
కర్తవ్యం చిత్రానికి జీబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. చక్రం, డేంజర్ మరియు కృష్ణార్జున చిత్రాలకి పనిచేసిన ఓం ప్రకాష్ ఈ చిత్రానికి కెమరామెన్గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది. త్వరలో విడుదల అవుతుంది. కర్తవ్యం చిత్రంలో నయనతార, విగ్నేష్, రమేష్, సును లక్ష్మి, వినోదిని వైద్యనాథన్, రామచంద్రన్ దురైరాజ్, ఆనంద్ కృష్ణన్ నటించారు.


Click it and Unblock the Notifications











