twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నయనతార,షీలా లతో ఒకేసారి..జూ ఎన్టీఆర్

    By Srikanya
    |

    ఈ తరం హీరోల్లో జూ ఎన్టీఆర్ డాన్స్ లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. దాంతో దర్శక,నిర్మాతలు కూడా డాన్స్ లు ప్రత్యేకంగా చిత్రీకంరిచటానికి ఉత్సాహపడుతూంటారు. తాజాగా వి.వి.వినాయిక్ కాంబినేషన్లో రెడీ అవుతున్న అదుర్స్ చిత్రానికి సంబంధించిన ఓ పాట చిత్రీకరణ అన్నపూర్ణా స్టూడియోలో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన పబ్ సెట్ లో చిత్రీకరిస్తున్నఈ పాటలో జూ ఎన్టీఆర్ తో పాటు హీరోయిన్స్ నయనతార, షీలా పాల్గొంటున్నారు. నారీ నారీ నడుమ మురారి తరహాలో ఇద్దరి భామల మద్యా జూ ఎన్టీఆర్ అదుర్స్ అనిపించనున్నాడు. ఈ సాంగ్ చిత్రంలో హైలెట్ అవుతుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.

    ఇక ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో నిర్మాత వల్లభనేని వంశీ మాట్లాడుతూ..జూ ఎన్టీఆర్, వినాయక్ కాంబనేషన్ లో వస్తున్న మూడో చిత్రమిదనీ, ప్రేక్షకుల అంచనాలకు ధీటుగా జూ ఎన్టీఆర్, వినాయక్ కెరీర్ లో ఓ ల్యాండ్ మార్క్ చిత్రంగా ఇది ఉంటుందనీ చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఎక్స్ టార్డినరీగా ఉంటుందన్నారు. ఈనెల మూడోవారంలో ఆడియో, డిసెంబర్ మూడో వారంలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. అలాగే వారం రోజుల పాటు జరిగే ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుందని అన్నారు.

    ఇక ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ ద్విపాత్రలలో కనిపించనున్నారు. కామిడీతో పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ తో ఈ చిత్రం రూపొందుతోందని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో మహేష్ మంజ్రేకర్, సాయాజీ షిండే, నాజర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ-మాటలు, ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, ఆనంద సాయి కళాదర్శకత్వం వహిస్తున్నారు. కొడాలి నాని చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X