For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  బాలయ్యకూ షాకిచ్చిన నయనతార.. ఎవరైతే నాకేంటీ..

  By Rajababu
  |
  బాలయ్యకు షాకిచ్చిన నయనతార !

  దక్షిణాదిలో అగ్రతార ఎవరంటే ఠక్కున దొరికే సమాధానం నయనతార. గ్లామర్ పాత్రలే కాకుండా సోలో హీరోయిన్‌గా బరువైన పాత్రలు ధరించి నయనతార సక్సెస్ సాధిస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన అరమ్ చిత్రం ఘనవిజయం సాధించింది. తాజాగా విడుదలైన వేలక్కైరన్ చిత్రం మంచి టాక్ సంపాదించుకొన్నది. ప్రస్తుతం తెలుగులో నయనతార నటించిన జై సింహా చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ ఆడియో కార్యక్రమానికి ఆమె హాజరుకాకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

   నయనతార గైర్హాజరు

  నయనతార గైర్హాజరు

  జై సింహ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గత శనివారం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రంలో నటించిన హీరోయిన్లు హరిప్రియ, నటాషా ఇతర నటీనటులు, సాంకేతికవర్గ నిపుణులు, పలువురు రాజకీయ నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ నయనతార మాత్రం కనుపించలేదు.

   నయనతార బేఖాతరు

  నయనతార బేఖాతరు

  జై సింహా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని నయనతారను ప్రత్యేకంగా ఆహ్వానించారట చిత్ర యూనిట్. భారీ ఎత్తున ఫంక్షన్ నిర్వహిస్తున్నందున తప్పనిసరిగా వస్తే మరింత క్రేజ్ వస్తుందని పేర్కొన్నారట. కానీ వ్యక్తిగత కారణాలు చూపి జై సింహా ఆడియోకు డుమ్మా కొట్టింది.

  బాలకృష్ణతో మూడోసారి

  బాలకృష్ణతో మూడోసారి

  బాలకృష్ణతో నయనతార నటించడం ఇది మూడోసారి. గతంలో సింహా, శ్రీరామరాజ్యం చిత్రాల్లో బాలయ్యతో నటించింది. అయితే బాలయ్య స్టాటస్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి నయనతార వస్తుందని అందరూ ఆశించారు. కానీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడైన బాలకృష్ణ ఫంక్షన్‌కు రాకపోయే సరికి ఆమె తీరును తప్పుబడుతున్నారు. ఎవరైతే ఏమిటనే విధంగా వ్యవహరించడం సరికాదనే మాట వినిపిస్తున్నది.

   గత కొద్దికాలంగా ఫంక్షన్లకు డుమ్మా

  గత కొద్దికాలంగా ఫంక్షన్లకు డుమ్మా

  గత కొద్దికాలంగా తాను నటించిన సినిమా ప్రమోషన్లకు గానీ, ఫంక్షన్లుకు నయనతార హాజరైనట్టు దాఖలాలు లేవు. సినిమాలు అంగీకరించే సమయంలోనే నయనతార కొన్ని షరతులను విధిస్తున్నారనేది ఇన్‌సైడ్ టాక్.

  చివరిసారిగా కృష్ణం వందే

  చివరిసారిగా కృష్ణం వందే

  తెలుగు సినిమా పరిశ్రమలో నయనతారకు భారీ ఆఫర్లు వస్తున్నప్పటికీ తన తీరును మార్చుకోవడం లేదనే వాదన వినిపిస్తున్నది. నయనతార చివరిసారిగా రానా దగ్గుబాటి నటించిన కృష్ణం వందే జగద్దురం చిత్ర ప్రమోషనల్‌లో పాల్గొన్నారు. అప్పటి నుంచి ఏ కార్యక్రమానికి కూడా హాజరుకాకపోవడం గమనార్హం.

   అదనంగా రెమ్యూనరేషన్

  అదనంగా రెమ్యూనరేషన్

  ఇటీవల ఓ ప్రముఖ హీరోతో నటించిన సినిమా కార్యక్రమంలో పాల్గొనాలని చిత్ర నిర్మాతలు సంప్రదించారట. అయితే ఆమె ఆ కార్యక్రమానికి రాలేను అని ఖరాఖండీగా చెప్పేసిందట. తప్పనిసరి పరిస్థితిలో రావాలంటే అదనంగా రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసిందట. దాంతో నిర్మాతలు నోరుమెదపకుండా కార్యక్రమాన్ని కానిచ్చేశారు.

  English summary
  Nayanthara's latest movies is Jai Simha in Telugu. She has been paired third time with Nandamoori Balakrishna. This movie Audio Release function organised at Vijayawada recenlty. Despite film unit request, she ignored Jai Simha Audio function makes debate in Tollywood.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more