బార్సిలోనాలో నయనతార హాట్ ఫోటోషూట్.. విఘ్నేశ్ శివన్ కామెంట్ చూస్తే మతిపోవాల్సిందే!

నయనతార విఘ్నేశ్ శివన్ ప్రస్తుతం వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లైన తరువాత హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన ఈ జంట.. ఇప్పుడిలా బార్సిలోనాకు వెళ్లింది. గత కొన్ని రోజులుగా నయన్ విఘ్నేశ్ బార్సిలోనాలోనే ఎంజాయ్ చేస్తున్నారు. వికి క్లిక్స్ అంటూ నయనతార అందమైన ఫోటోలను, వింత వింత యాంగిల్స్‌లో విఘ్నేశ్ శివన్ షేర్ చేస్తున్నాడు. ఇక అన్ని ఫోటోల్లోనూ నయనతార మెడలో ఉన్న పసుపుతాడు మాత్రం హైలెట్ అవుతూ వస్తోంది. తాజాగా మరోసారి విఘ్నేశ్ తన టాలెంట్‌కు పదును పెట్టేశాడు.

 ఘనంగా వివాహాం..

ఘనంగా వివాహాం..


నయన్ విఘ్నేశ్ ప్రేమ, పెళ్లి, డేటింగ్‌ల మీద ఎన్ని రకాల రూమర్లు వచ్చాయో అందరికీ తెలిసిందే. కొన్ని రోజులేమో.. ఈ ఇద్దరూ విడిపోయారని వార్తలు వస్తాయి. ఇంకొన్ని రోజులేమో డేటింగ్‌లోనే ఉంటారనే కథనాలు వచ్చేవి. దోష నివారణ కోసం గుళ్లూ గోపురాలు తిరుగుతున్నారని,త్వరలోనే వివాహాం చేసుకుంటారని వార్తలు వచ్చేవి. మొత్తానికి నయన్ విఘ్నేశ్ ఇద్దరూ కూడా జూన్‌ 9న వివాహా బంధంతో ఒక్కటయ్యారు.

 వివాదాల నడుమ..

వివాదాల నడుమ..


మహాబలిపురంలో నయన్ విఘ్నేశ్ పెళ్లి వేడుకలు జరిగాయి. పెళ్లికి సంబంధించిన కాంట్రాక్ట్ నెట్ ఫ్లిక్స్ తీసుకుందని టాక్. రూ. 25 కోట్లకు ఈ డీల్ జరిగిందట. నిబంధనలు ఉల్లంఘించారంటూ నయన్ విఘ్నేశ్‌లకు నెట్ ఫ్లిక్స్ జరిమానా విధించిందనే రూమర్ కూడా వచ్చింది. ఇక తిరుమలలో నయన్ మాఢవీధుల్లో చెప్పులేసుకుని నడవడం, అక్కడ ఫోటో షూట్లు చేయడం కూడా రచ్చగా మారింది.

వెనక్కి తగ్గిన విఘ్నేశ్..

వెనక్కి తగ్గిన విఘ్నేశ్..


ఇలా పెళ్లైన వెంటనే వివాదాలు చుట్టుముట్టుకోవడంపై విఘ్నేశ్ శివన్ హర్ట్ అయినట్టున్నాడు. తిరుమల వివాదం మరింత పెద్దది కాకముందే.. కాస్త తగ్గాడు. అందరికీ క్షమాపణలు చెబుతూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశాడు. తాము పెళ్లి బట్టల్లోనే తిరుమలకు వచ్చామని, అలా తెలియకుండా నయన్ నడిచేసిందని, ఫోటో షూట్లు చేయడం వెనుక కూడా వేరే ఉద్దేశ్యం లేదని, తమకు తిరుమలలో పెళ్లి జరిపించుకోవాలనే కోరిక ఉండేదని, కానీ కుదరకపోవడంతో ఇలా పెళ్లి బట్టల్లో ఫోటో షూట్లు చేయించుకున్నామని చెప్పుకొచ్చాడు.

బార్సిలోనాలో సందడి..


ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ నయన్ అందాలను తన కెమెరాలో బంధించే పనిలో ఉన్నాడు. ప్రపంచంలోని అందమంతా నీదే.. ఈ ప్రపంచంలో నీ లాంటి అమ్మాయి లేదు.. ప్రపంచంలో కెల్లా అందమైన అమ్మాయివి నీవే అన్నట్టుగా ఇలా నయన్ మీద కవిత్వం రాసేశాడు విఘ్నేశ్. ఇక నయన్ బుల్లి నిక్కర్లో థండర్ థైస్ షో చేసేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X