త్రిషను కాదని నయనతారని తీసుకోమన్న వెంకటేష్
తనతో నమో వెంకటేశ చిత్రంలో చేసిన త్రిషను తన తాజా చిత్రం సావిత్రిలో వద్దని వెంకటేష్ చెప్పేసారు. ఆ ప్లేసులో తనకు తులసి, లక్ష్మితో హిట్టు ఇచ్చిన నయనతారని ప్రపోజ్ చేసారు. తేజ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం డిసెంబర్ 13(వెంకటేష్ పుట్టినరోజు) న ప్రారంభం కానుంది. జనవరి నుంచి కంటిన్యూ షెడ్యూల్ జరుగుతుంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్ బాబు నిర్మిస్తారు. ఈ చిత్రంలో వెంకటేష్ ఓ విభిన్నమైన పాత్రను చేస్తారని, క్యారెక్టర్ ఓరియెంటెడ్ చిత్రమని బయిట ప్రచారం జరుగుతోంది. అలాగే వెంకటేష్ సూపర్ హిట్ చంటిలా ఉండబోతోందని వినికిడి. ఇక నయనతార ప్రస్తుతం బాపు దర్శకత్వంలో రామరాజ్యం చిత్రంలో బాలయ్య ప్రక్కన చేయటానికి కమిటయ్యింది. అలాగే వెంకటేష్ తాజా చిత్రం నాగవల్లి ఈ నెలలలోనే విడుదల కానుంది. ఇక తేజ చివరిగా కేక వంటి డిజాస్టర్ చిత్రాన్ని అందించారు. తేజ...కేక చిత్రం తర్వాత అటు...ఇటు అనే చిత్రాన్ని ప్రారంభించారు. కానీ పూర్తి చేయలేదు.


Click it and Unblock the Notifications











