»   » ఏం? మేం తప్పులు చేయకూడదా?: నయనతార

ఏం? మేం తప్పులు చేయకూడదా?: నయనతార

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్ : ఏం? మేం తప్పులు చేయకూడదా?? అసలు తప్పులు చెయ్యనివారు ఎవరుంటారు?? కానీ మా తప్పులనే భూతద్దంలో ఎందుకు చూస్తారు? అందరికీ ఉన్నట్లే మాకూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. ఆవేశాలు, అనుభూతులు, ఆగ్రహాలు, మనోవేదనలు.. ఇలా అన్నీ ఉంటాయి. కానీ వాటిని గుర్తించరు. సెలబ్రిటీలు చిన్న తప్పు చేసినా దాన్ని పెద్దది చేస్తారు అంటోంది నయనతార. ఆమె తనపై మీడియాలో వచ్చే వార్తల గురించి మాట్లాడుతూ ఇలా స్పందించింది.

  అయితే తాను సెలబ్రిటీ అయినందుకు మంచి, చెడు రెండూ చూస్తున్నారని అంది. మంచిని ఎలా తీసుకుంటున్నానో చెడుని కూడా అలానే తీసుకోవడం అలవాటు చేసుకున్నాను. నా పని సినిమాల్లో యాక్ట్ చేయడం. మీడియావారి పని రాయడం. వాళ్ల పనే కదా వాళ్లు చేస్తున్నారు అని ఆలోచించేంత పరిణతి నాలో వచ్చింది. ఈ దశ నాకు చాలా హాయిగా ఉంది.మొదట్లో చదువుకుని బాధపడేదాన్ని. పోను పోను చదవడం మానేశాను. ఒక దశ తర్వాత అన్నిటికీ అతీతంగా స్పందించే పరిపక్వత ఎవరికైనా వస్తుంది. ప్రస్తుతం నేను ఆ దశలోనే ఉన్నాను అంది.

  తన తాజా చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'లో చేసిన పాత్ర గురించి చెబుతూ... కృష్ణం వందే జగద్గురుమ్ లో దేవిక'గా చేశాను. దేవిక డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలున్న అమ్మాయి. స్వతంత్ర భావాలున్న అమ్మాయి. ఈ పాత్రను చాలా ఎంజాయ్ చేశాను. నా మనస్తత్వానికి ఈ పాత్ర చాలా వరకు దగ్గరగా ఉంటుంది.
  రియల్ లైఫ్‌లో నేను చాలా బోల్డ్. నాకు కరెక్ట్ అనిపించిన ఏ పనైనా చేస్తాను. నా నిర్ణయాలు నేనే తీసుకుంటాను. కాబట్టి దేవిక పాత్ర కొంతవరకు నాకు మనస్తత్వానికి దగ్గరగా ఉంటుంది అన్నారు.


  'కేవీజె' ద్వారా మొదటిసారి నా గొంతుని ప్రేక్షకులకు వినిపించబోతున్నాను. క్రిష్ తీసిన 'కేవీజె'లో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. అయితే ఆ అనుభవం గురించి ఇప్పుడేం చెప్పదల్చుకోలేదు. నా 'మాట' ఎలా ఉంటుందో రేపు ప్రేక్షకులు వింటారు. క్రిష్ సినిమాల్లో హీరోయిన్స్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. క్రిష్‌కి సినిమాలంటే పిచ్చి ప్రేమ. ఒక సినిమాని ఆయన ఎంతగా ప్రేమించి తీస్తారో ఈ చిత్రం చేస్తున్నప్పుడు తెలిసింది. నేను పని చేసిన అద్భుతమైన దర్శకుల్లో క్రిష్ ఒకరు. ఒక కొత్త రకం అనుభూతిని పొందగలిగాను. 'కృష్ణం వందే జగద్గురుమ్' నాకు మంచి అనుభూతినిచ్చింది అని చెప్పారామె.

  Read more about: నయనతార nayantara
  English summary
  
 Nayan Tara's forthcoming action drama film ‘Krishnam Vande Jagadgurum (KVJ)’ is being scheduled to release on November 9th, 2012. Sources close to the production house indicate that the makers are planning to eye the above date, as the movie is nearing completion of post-production works.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more