నాగార్జునతో రొమాన్స్‌కు నయనతార గ్రీన్ సిగ్నల్!
త్వరలో ప్రభుదేవాను పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో నయనతార సినిమాలకు దూరం అవుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బాలయ్యతో నటించిన శ్రీరామ రాజ్యం సినిమానే ఆమె చివరి సినిమా అని జోరుగా ప్రచారం కూడా జరిగింది. అయితే అవన్నీ అవాస్తవాలని, నయనతార మళ్లీ నటించేందుకు సిద్ధం అవుతుందని తాజాగా అందిన సమాచారం. సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం నయన తార నాగార్జున హీరోగా రూపొందనున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.
సంతోషం, మిస్టర్ పర్ ఫెక్ట్ చిత్రాల దర్శకడు దశరథ్ నాగార్జునతో రూపొందించబోతున్న సినిమా విషయమై నయనతారను సంప్రదించగా ఆమె అంగీకారం తెలిపిందని అంటున్నారు. ప్రముఖ నిర్మాత శివప్రసాద్ రెడ్డి కామాక్షి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించ బోతున్నట్లు చర్చించుకుంటున్నారు. ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
నాగార్జున ప్రస్తుతం 'డమరుకం' చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతున్న ఈచిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన అనుష్క నటిస్తోంది. ఆర్ ఆర్ వెంకట్ ఈ చిత్రాన్ని ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











