వెంకటేష్ కి జోడిగా నయనతార మరోసారి...

By Srikanya

హైదరాబాద్ : వెంకటేష్, నయనతార లది హిట్ కాంబినేషన్. గతంలో 'లక్ష్మీ', 'తులసి' సినిమాల్లో వీరిద్దరూ కలసి నటించారు. లక్ష్మీలో 'లక్ష్మీ బావ.. లక్ష్మీబావ...' పాట పెద్ద హిట్టై అన్ని వర్గాల ఆదరణ పొందింది. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ పలకరించనుంది.

'ఈరోజుల్లో' సినిమాతో దర్శకుడిగా తన శైలి చాటుకొన్నారు మారుతి. ఇప్పుడు అల్లు శిరీష్‌, రెజీనాలను 'కొత్తజంట'గా చూపించబోతున్నారు. ఆతరవాత ఆయన వెంకటేష్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకి 'రాధ' అనే పేరు కూడా పెట్టారు. డి.వి.వి.దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తారు.

'కొత్తజంట' పనులు చూసుకొంటూనే మరోవైపు 'రాధ' స్క్రిప్టుపైనా దృష్టి పెట్టారు మారుతి. ఈ సినిమాలో వెంకటేష్‌ పక్కన హీరోయిన్స్ కోసం కసరత్తులు జరుపుతున్నారు. చాలామంది పేర్లు పరిశీలించిన తరవాత నయనతారని ఖరారు చేసినట్టు సమాచారం.

ఇక వెంకటేష్‌ నటించిన 'మసాలా' తుది మెరుగులు దిద్దుకొంటోంది. నవంబరు 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తరవాత 'రాధ' కబుర్లు తెలిసే అవకాశం ఉంది. 2014 సంక్రాంతి రోజున 'రాధ'ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ తో మిక్స్ చేసిన యాక్షన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X