అయ్యోరామా నాకూ లౌక్యం తెలుసు!
హీరోయిన్లకు స్టార్‌డమ్ అనేది ఎంతకాలం ఉంటుందనేది ఎవరూ చెప్పలేరు. అయితే ఇవాల్టి హీరోయిన్లు కొంత గడుసరితనం, మరికొంత లౌక్యంతో ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ఒక భాషలో కాకపోతే మరో భాషలో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. నయనతార ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
'చంద్రముఖి" చిత్రంతో తెలుగు తెరకు పరచయమైన అందాల తార నయనతార, అటు తెలుగులో ఇటు తమిళ చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ సంపాదించిన నటి నయనతార. ఓవైపు హీరోయిన్‌గా నటిస్తూనే ఐటెం సాంగ్‌లకు కూడా ఓకే చెబుతోంది. దక్షిణాదిన తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార ఈమధ్యనే రజనీకాంత్ 'శివాజీ' చిత్రంలో ఐటెంసాంగ్ చేసిన నయనతార ఆ తర్వాత 'కుచేలన్'లోనూ నటించింది.
ప్రస్తుతం ఆమె ఇప్పుడు రజనీకాంత్ తనయురాలు సౌందర్య నిర్మిస్తున్న 'గోవా" చిత్రంలో స్నేహ కథానాయికగా చేయగా,నయనతార ఐటం సాంగ్ చేస్తోంది. తెలుగులో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న 'సింహా'లో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా నటిస్తోంది. తమిళంలో హన్సిక హీరోయిన్ గా చేస్తున్న 'పిళ్ళై" లోనూ నయనతార ఐటం సాంగ్ చేస్తోంది. అయితే ఆమెకి హీరోయిన్ అవకాశాలే రావాలని పట్టుబట్టకుండా పరిశ్రమలోని మిత్రుల కోసం, సన్నిహితుల కోసం తన రూల్స్ మార్చుకొంటోంది.


Click it and Unblock the Notifications











