కోపానికి నయన మందు!!!
శింబుతో ప్రేమ వ్యవహారాన్ని నడిపి ఇపుడు అతనికి దూరమైన నటి నయనతార. తెలుగులో, తమిళంలో అవకాశాలతో బిజీగానే ఉంటున్న నయనతార తన గురించి వచ్చిన పుకార్లు చూస్తే చాలా కోపం వస్తుందట. అసలు ఇలాంటి నిరాధార వార్తలు ఎలా రాయగలుగుతారోనని ఆశ్చర్యపోతుందట. తొలుత కోపం వచ్చినా నెమ్మదిగా సాధారణ స్థాయికి వస్తుందట. గాసిప్స్ అనేవి సినీ నటి జీవితంలో సహజమేననే ఆ తరువాత అనిపిస్తుందట. ఒక్కసారిగా గాసిప్ లను చూసే సరికి సర్రున కోపం వస్తుందిట. ఎపుడైతే కోపం వస్తుందో అపుడు కోపం తగ్గించుకోవడానికి హరిహరన్ ఘజల్స్ వింటుందట. అవి వింటుంటే కోపం తగ్గి సాధారణ స్థాయికి వస్తుందట.


Click it and Unblock the Notifications











