క్రిష్ సినిమాలో జర్నలిస్టుగా నయనతార
హీరోయిన్ నయనతార జర్నలిస్టుగా కనిపించబోతోంది. గమ్యం, వేదం చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రానా హీరోగా నటిస్తున్న ఈచిత్రంలో నయనతార జర్నలిస్టు పాత్రను పోషిస్తోంది. ఈ రోజు నుంచి నయనతార చిత్ర షూటింగులో జాయిన్ అయింది. క్రిష్ సినిమా అంటేనే నటీనటులకు అద్భుతమైన పాత్రలుంటాయి. అందుకే అతనిపై నమ్మకంతో కథ వినకముందు సైన్ చేసి, ఆ తర్వాత కథ విన్నదట ఈ అమ్మడు.
ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో మెయిన్ లీడ్ రానా దగ్గుబాటి 'బిటెక్ బాబు' క్యారెక్టర్ చేస్తున్నాడు. చదువు బీటెక్. ఈ మాత్రం చదువుకొంటే చాలు... ఓ మంచి ఉద్యోగం సంపాదించేసి, హాయిగా జీవితాన్ని గడిపేద్దాం అనుకొంటారు. కానీ బాబు అలా కాదు. ఏసీ గదుల్లో కూర్చుంటూ నెలకు వచ్చే నాలుగంకెల జీతంతో సంతృప్తి పడలేదు. అతని లక్ష్యం వేరే ఉంటుంది.
కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రాన్ని జాగర్లమూడి సాయి బాబు, వై. రాజీనవ్ రెడ్డి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











