షూటింగులకు డుమ్మా కొట్టి నయనతార...వెళ్లేది అక్కడికే!
హైదరాబాద్ : ప్రభుదేవాతో ప్రేమాయణం చెడిన తర్వాత హీరోయిన్ నయన తార సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. నయనతార గ్లామర్ ఏమాత్రం తగ్గకపోగా, ఆమె ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తుండటంతో రాణా లాంటి యువ హీరోల సరసన కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తన అందాలపై మరింత శ్రద్ధపెట్టింది ఈ కేరళ బ్యూటీ. ప్రతి నెల క్రమం తప్పకుండా షూటింగులకు డుమ్మాకొట్టి మరీ కేరళలో సౌందర్యం కోసం ప్రత్యేకమైన ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. ఎంత బిజీ షూటింగులు ఉన్నా నెలలో దాదాపు 3 నుంచి నాలుగు రోజులు ఈ ట్రీట్ మెంట్ కోసమే కేటాయిస్తోందట.
ప్రస్తుతం నయనతార పలు తెలుగు, తమిళం ప్రాజెక్టులో బిజీగా గడుపుతోంది. నాగార్జున, దశరత్ కాంబినేషన్లో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవే కాకుండా రాణా హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రంలో నటిస్తోంది.
నయనతార వీటితో పాటు తమిళంలో రెండు సినిమాలో చేస్తోంది. అజిత్ హీరోగా విష్ణు వర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంతో పాటు....ఆర్య సరసన రాజా రాణి అనే చిత్రంలో కూడా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











