నలిగిన నయనతార.... తప్పెవరిది?

By Bojja Kumar

ఒకసారి అంటే ఏమో అనుకోవచ్చు. కానీ రెండో సారి అదే రిపీట్ అయితే అందరిలోనూ అనుమానాలు రెకెత్తడం సహజం. సినీ నటి నయనతార విషయమే తీసుకుంటే ...ఈ భామ ఒక్కరు కాదు, ఇద్దరి మగాళ్ల మధ్య నలిగి పోయింది. తొలుత శింబుతో ప్రేమాయణం కొనసాగించింది. వీరిద్దరి మధ్య రొమాన్స్ ఇంటర్నెట్ లోనూ హల్ చల్ చేసింది. పెళ్లి వరకు వచ్చిన వారి బంధం అర్ధాంతరంగా తెగి పోయింది.

అనంతరం ప్రభుదేవాతో దాదాపు మూడేళ్లుగా సుదీర్ఘ ప్రేమాయణం సాగించిన నయనతార ఇటీవలే ఆ ప్రణయబంధానికి వీడ్కోలు పలికిపట్లు మీడియా ముఖంగా ప్రకటించింది. దాదాపు పెళ్లిదాకా వెళ్లిన ఈ జంట ప్రేమవూపయాణం అనూహ్యంగా ఎందుకు ముగిసిపోయింది? పెళ్లి కాకుండానే ఓ సౌత్ ఇండియా అవార్డుల వేడుకలో 'బెస్ట్ కపుల్' అవార్డును అందుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన ఈ జంట విషయంలో తప్పెక్కడ జరిగింది? కెరీర్ పతాక స్థాయిలో వుండి కూడా ప్రభుదేవా కోసం సినిమాలు వదులుకుంటున్నానని బోల్డ్‌స్టేట్‌మెంట్ ఇచ్చిన నయనతార జీవితంలో విఫల ప్రేమకు దారితీసిన పరిణామాలేమిటి?...ఇప్పుడు జనాల మదిలో మెదలుతున్న సందేశాలు.

జీవితంలోలాగానే ప్రేమలో కూడా ఆశనిరాశలు దోబూచులాడుతాయని, జీవితంలో వాటిని గుణపాఠాలుగా తీసుకొని సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టానని, విఫల ప్రేమ అయినంత మాత్రాన తన ప్రేమలోని నిజాయితీని శంకించాల్సిన అవసరం లేదని, ప్రేమలో వందశాతం కమిట్‌మెంట్ తనదని చెబుతున్న నయనతార నిజంగా ఏ తప్పూ చేయలేదా? నయనతార ప్రేమ కోసం భార్యను, పిల్లలను వదులుకున్న ప్రభుదేవా....ఇంత వ్యవహారం జరిగాక నయనకు ఎందుకు దూరం అయ్యాడు? అంత పెద్ద సమస్య వీరి మధ్య ఏమొచ్చింది? అనేవి సమాధానం దొరకని ప్రశ్నలుగా మారాయి.

ఈ పరిణామాల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న నయనతార మళ్లీ సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. వరుస సినిమాలకు సైన్ చేస్తూ మళ్లీ సినిమా లోకంలో మునిగిపోవడానికి సిద్ధం అవుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇరగదీసిన నయన మరి సెకండ్ ఇన్నింగ్స్ లో ఏమేరకు రాణిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X