నయనతారకు కేక్ తినిపించిన మెగాస్టార్ చిరంజీవి
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార నవంబర్ 18న బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ ఆధ్వర్యంలో నయన్ 45వ పుట్టినరోజు వేడుక కలర్‌ఫుల్‌గా జరిగింది. కాగా రెండు రోజుల ముందే నయనతార పుట్టినరోజు వేడుక 'సైరా నరిసింహారెడ్డి' సెట్లో జరిగిందట.
'సైరా'లో మెగాస్టార్ భార్య పాత్రలో నటిస్తున్న నయనతార.... తన పుట్టినరోజు ముందు రోజు వరకు షూటింగులో గడిపారు. బర్త్ డే విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆమె కోసం ప్రత్యేకంగా కేక్ తెప్పించి సెట్స్‌లోనే ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారట.

మరో వైపు నయనతార పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం మోషన్ పోస్టర్ సైతం విడుదల చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్య 'సిద్ధమ్మ' పాత్ర పోషిస్తున్నారు.
కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. 2019 సమ్మర్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











