»   » బొడ్డు సీన్ లొల్లి...ఆహీరోయిన్‌పై మండిపడ్డ నయనతార!

బొడ్డు సీన్ లొల్లి...ఆహీరోయిన్‌పై మండిపడ్డ నయనతార!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ధనుష్ హీరోగా తెరకెక్కిన 'నైయాండి' అనే తమిళ మూవీలో హీరోయిన్‌గా నటించిన నజ్రియా నజీమ్....సినిమాలోని బొడ్డు సీన్ విషయంలో రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. చెన్నై పోలీస్ కమీషనర్‌కు కూడా ఫిర్యాదు చేసింది. తన అనుమతి లేకుండా తనను అసభ్యంగా చూపించారని హీరోయిన్ నజ్రియా నీజీమ్ తెగ హడావుడి చేసింది.

ఈ ఘటనపై స్టార్ హీరోయిన్ నయనతార స్పందించింది. ఆ సీన్ విషయంలో నజ్రియా అనవసర రాద్దాంతం చేసిందని విమర్శించింది. ఇటీవల విడుదలైన రాజారాణి చిత్రంలో నజ్రియా-నయనతార కలిసి నటించారు. ఇంతకాలం నజ్రియా చేసిన హడావుడిపై సైలెంటుగా ఉన్న నయనతార....ఇప్పుడు నజ్రియా తీరును తప్పుపడుతూ వ్యాఖ్యలు చేసింది.

'నైయాండి' సినిమా విడుదల సమయంలో నజ్రియా చేసిన రాద్దాంతంకారణంగా.....సినిమా వసూళ్లపై ఎఫెక్టు పడింది. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు

ఆశ్చర్యంగా వెనక్కి తగ్గిన నజ్రియా

ఆశ్చర్యంగా వెనక్కి తగ్గిన నజ్రియా


సినిమాలో తనను అసభ్యంగా చూపించారంటూ రచ్చరచ్చ చేసి పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసిన నజ్రియా...ఉన్నట్టుండి తన కంప్లైంట్ వెనక్కి తీసుకుంది. దీంతో ఆమె పబ్లిసిటీ కోసమే ఇంత సీన్ క్రియేట్ చేసినట్లు స్పష్టం అయింది.

విమర్శించిన నయనతార

విమర్శించిన నయనతార


నజ్రియా అలా చేయడం సరికాదని....నయనతార విమర్శించినట్లు సమాచారం. గ్లామర్ ఫీల్డులో ఉన్నప్పుడు ఇలాంటివి కామనే. ఇలాంటి సిల్లీ విషయాలపై ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని నయన అభిప్రాయ పడిందట.

పెద్ద పెద్ద హీరోయిన్లే చేస్తున్నారు

పెద్ద పెద్ద హీరోయిన్లే చేస్తున్నారు


ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఏ-క్లాస్ హీరోయిన్లు కూడా ఐటం సాంగులు చేస్తున్నారు. స్కిన్ షో అనేది ఇపుడు సినిమాల్లో సర్వ సాధారణం. నజ్రియా అలా చేయడం ఫన్నీగా ఉందని నయనతార అభిప్రాయ పడిందట.

ఎక్స్ ఫోజింగుపై నయనతార..

ఎక్స్ ఫోజింగుపై నయనతార..


‘సినిమా ఫీల్డులోకి వచ్చిన తర్వాత ఎక్స్ ఫోజింగుకు భయ పడితే కుదరదు. ఎక్స్ ఫోజింగ్ విషయాలపై ఫిర్యాదు చేయడం అర్ధరహితం' అని నయన అభిప్రాయ పడినట్లు సమాచారం.

నజ్రియాపై బ్యాన్

నజ్రియాపై బ్యాన్


నజ్రియా అలా చేయడంతో..తమిళ ఫిల్మ్ మేకర్స్ అంతా ఆమెపై అనధికారిక నిషేదం విధించారట. ఆమెను ఏ సినిమాలోనూ తీసుకోకూడదని నిర్ణయించినట్లు చెన్నై సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

నజ్రియా ఆరోపణలు

నజ్రియా ఆరోపణలు


నజ్రియా తన ఫిర్యాదులో....‘నేను కేరళలోని త్రివేంద్రంకు చెందిన ఎంతో మర్యాద పూర్వకమైన ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చాను. తమిళం, మళయాలం చిత్రాల్లో ఎన్నో మంచి పాత్రలు చేసారు. నేను ఫిర్యాదు చేయడానికి కారణం ఈ చిత్రంలో తన అనుమతి లేకుండా తనను అసభ్యంగా చూపించడమే. నేను నటించని సీన్ వేరే వారితో చేయించి నేను చేసినట్లుగా చూపించారు. నేను వెంటనే దర్శకుడు సర్‌కునమ్‌కు ఫోన్ చేసాను. ఎందుకిలా చేసారని అడిగాను. కానీ అతను అమర్యాదగా మాట్లాడారు. మా కమ్యూనిటీ గురించి అమర్యాదగా మాట్లాడారు. బెదిరించారు' అని నజ్రియా తెలిపింది' అని ఆమె తెలిపారు.

నజ్రియా పెర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు

నజ్రియా పెర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు


నజ్రియా కాంట్రవర్సీ మూలంగా ఆమెపై దర్శక నిర్మాతల కోపంగా ఉన్నప్పటికీ....నైయాండి సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్‌కు ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

నజ్రియా తర్వాతి సినిమాలు

నజ్రియా తర్వాతి సినిమాలు


నజ్రియా ఇతర తమిళ సినిమాలు ప్రస్తుతం నజ్రియా జీవా హీరోగా తెరకెక్కుతున్న ‘నీ నల్ల వరువద' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఆర్.బి.చౌదరి నిర్మిస్తున్నారు. చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. నజ్రియా ప్రస్తుతం జై హీరోగా తెరకెక్కుతున్న ‘తిరుమనమ్ ఎన్నుమ్ నిఖక్కా' అనే తమిళ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. అనీస్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్నారు.

English summary
Nazriya Nazim's Naiyaandi controversy seems be refusing to die. Even after two weeks, the actress is hitting the headlines on the same issue. Now, latest about the same is that Nayantara has blasted the Mallu girl for unnecessarily creating the controversy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu