ప్రియుడితో కలిసి నయనతార క్రిస్మస్ సెలబ్రేషన్స్, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేనట్లే!
సౌత్ టాప్ హీరోయిన్ నయనతార కొన్నేళ్లుగా దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. సంవత్సరం క్రితమే తమ ఎఫైర్ విషయంలో ఓపెన్ అయిపోయిన ఈ ప్రేమ జంట రహస్య కార్యకలాపాలను పక్కన పెట్టి తమ జీవితంలోని ప్రతి మూమెంటు ఎలాంటి దాపరికాలు లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు.
క్రిస్టియన్ మతానికి చెందిన నయనతార క్రిస్మస్ వేడుకలను ప్రియుడితో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు. పండగ రోజున ఆమె ఎంతో సంతోషంగా గడిపినట్లు ఈ పిక్స్ చూస్తే స్పష్టమవుతోంది.

క్రిస్మస్ ట్రీ అలంకరిస్తూ...
క్రిస్మస్ వేడుకలో భాగంగా నయనతార క్రిస్మస్ ట్రీ అందంగా అలంకరిస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. వయసు పైబడుతున్నా ఆమెలో అందం ఏమాత్రం తగ్గలేదు అనడానికి ఈ ఫోటోయే నిదర్శనం.

ప్రియుడి సాంగత్యంలో...
తమకు ఇష్టమైన పండగగను, తమకు ఇష్టమైన వ్యక్తులతో కలిసి జరుపుకుంటే ఆ ఆనందం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ హ్యాపీనెస్ ఛాయలు నయనతార ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

15 ఇయర్స్ ఇండస్ట్రీ
నయనతార ఇండస్ట్రీలో కెరీర్ మొదలు పెట్టి 15 సంవత్సరాలు అవుతోంది. తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ కేరళ బ్యూటీ... సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరుగా వెలుగొందుతూ అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీ.

వివాహం ఎప్పుడు?
నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అంటే ఇప్పుడే చెప్పడం కష్టమే. వచ్చే ఏడాది వీరి పెళ్లి జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నా... అందులో నిజం లేదని అంటున్నారు.పెళ్లి తర్వాత కెరీర్ మీద ఎంతో కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉండటం వల్ల ప్రస్తుతానికి ఆ ఆలోచనకు వీలైనంత దూరంగా ఉంటున్నారట.


Click it and Unblock the Notifications











