ఎన్టీఆర్ అదుర్స్ సెట్ పై నయనతార పుట్టినరోజు వేడుక
నయనతార తన పుట్టిన రోజు వేడుకులను అదుర్స్ సెట్ పై జరుపుకుంది. ఎన్టీఆర్, వివినాయిక్ ,యూనిట్ సభ్యుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. నిజానికి ఆమె ఈ రోజు(బుధవారం)శెలవు అడిగింది. కానీ రిలీజ్ రోజు దగ్గరపడటంతో కాంబినేషన్ సీన్స్ కు ఇబ్బంది రాకూడదని ఆమెకు ఫర్మిషన్ ఇవ్వలేదు. ఇక ఆమె తన పుట్టినరోజు వేడుకలను నిన్న రాత్రి 12 గంటలకు ప్రభుదేవా సమక్షంలో జరుపుకుందని సమాచారం. ఇదే విషయాన్ని ఆమె చెపుతూ..నా స్నేహితులు రకరకాల ప్రదేశాల్లో ఉన్నా గేదర్ అయి రాత్రి నా చేత కేక్ కట్ చేయించారు. అది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే నన్ను ఆశ్చర్యపరిచే సర్పైజ్ గిప్ట్ లు కూడా ఇచ్చారు అంది. ఇక సెట్ లో వారంతా కూడా ఆమె పుట్టిన రోజు వేడుకలకు స్పెషల్ ఫుడ్ తో ఆనందించారు. ఇక ఈ రోజు రాత్రి తన సన్నిహితుల్లో కొద్ది మందికి ప్రత్యేక పార్టీ ఇవ్వనుందని సమాచారం. ఈ సందర్భంగా ఆమెకు దట్స్ తెలుగు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.


Click it and Unblock the Notifications











