నయనతార బర్త్ డే సెలబ్రేషన్స్ రాజా రాణి

By Bojja Kumar

చెన్నై: సౌతిండియా హాట్ హీరోయిన్ నయనతార తన పుట్టిన రోజు వేడుకలను అట్టహాసంగా జరుపుకోవడానికి పెద్దగా ఇష్ట పడరు. పుట్టిన రోజు వేళ కూడా ఆమె తన వర్క్ లోనే లీనమైపోతారు. ఆమె గత పుట్టినరోజు వేడుకలను చూసినా ఇదే విషయం స్పష్టమవుతుంది. నిన్న(నవంబర్ 18)తో 28వ ఏట అడుగు పెట్టిన నయన ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ నిర్మిస్తున్న 'రాజా రాణి' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ సారి కూడా షూటింగు స్పాట్ లోనే ఆమె పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.

నయనతార బర్త్ డే సెలబ్రేషన్స్ @ రాజా రాణి

నయనతార నటిస్తున్న ‘కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. రాణా హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడు.

నయనతార బర్త్ డే సెలబ్రేషన్స్ @ రాజా రాణి

విష్ణువర్ధన్ దర్శకత్వంలో గతంలో రూపొందిన తమిళ బిల్లా చిత్రంలో అజిత్ సరసన రొమాన్స్ చేసిన నయన... మరో సారి ఇదే కాంబినేషన్లో చేయబోతోంది.

నయనతార బర్త్ డే సెలబ్రేషన్స్ @ రాజా రాణి

ప్రస్తుతం ఆమె నాగార్జునతో నటిస్తున్న ‘లవ్ స్టోరీ' చిత్రానికి దశరథ్ దర్శకుడు.

నయనతార బర్త్ డే సెలబ్రేషన్స్ @ రాజా రాణి

ఆమె మురుగదాస్ నిర్మాణంలో ఆర్య సరసన చేస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి.

నయనతార బర్త్ డే సెలబ్రేషన్స్ @ రాజా రాణి

ప్రముఖ నటుడు కమల్ హాసన్ తో నటించాలని ఉందని నయనతార ఇటీవల వెల్లడించింది. త్వరలోనే ఆమె కోరిక తీరే అవకాశం ఉంది.

2012 సంవత్సరం నయనతార కెరీర్లోనే అత్యంత బిజీ సంవత్సం. ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి అడుగు పెట్టిన నయతతార వరుస ప్రాజెక్టులకు సైన్ చేసింది. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ ఆమె చేతి నిండా ప్రాజెక్టులు ఉన్నాయి. చాలా మంది దర్శకులు ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారంటే పరస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఆమె తెలుగులో క్రిష్ దర్శకత్వంలో రాణా హీరోగా రూపొందుతున్న 'కృష్టం వందే జగద్గురుమ్' చిత్రంలో నటిస్తోంది. మరో వైపు నాగార్జున హీరోగా రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రంలో నటిస్తోంది. తమిళంలో మురుగదాస్ నిర్మాణంలో ఆర్య హీరోగా రూపొందుతున్న 'రాజా రాణి' చిత్రంలో, విష్ణువర్ధన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా రూపొందబోయే చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X