రూల్స్ మార్చుకుని మీడియాకు షాక్ ఇచ్చిన నయనతార

By Srikanya

హైదరాబాద్ : నయనతార మొదటి నుంచి చిత్రం ప్రమోషనల్ ఏక్టివిటీస్ కి దూరంగా ఉంటుంది. అలాగే బుల్లి తెరపై వచ్చే యాడ్స్ సైతం ఎంత డబ్బు ఇచ్చినా చేయటానికి ఆసక్తి చూపలేదు. అయితే తాజాగా ఆమె తన రూల్స్ ని మార్చుకుని చిత్రం ప్రమేషన్ కోసం ఏర్పాటు చేసే మీడియా సమావేశాలకు హాజరవుతోంది. ఆమె నటించగా క్రితం శుక్రవారం విడుదలైన కృష్ణం వందే జగద్గురం చిత్రం ప్రమేషన్ లో ఆమె ఉత్సాహంగా పాల్గొని మీడియాకు షాక్ ఇచ్చింది. ఆమె, రానాతో కలిసి నటించిన చిత్రమిది. క్రిష్‌ దర్శకత్వం వహించారు.

సాధారణంగా సినిమా ప్రమోషన్స్‌కు, మీడియా సమావేశాలకు దూరంగా ఉండే నయనతార ఆ చిత్ర దర్శకుడు క్రిష్ మీద ఉన్న గౌరవం, నిర్మాతలు వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబుల మీద ఉన్న అభిమానంతో ఆమె 'కృష్ణం...' సక్సెస్ మీట్ కోసమని మైకు ముందుకు వచ్చారు.నయనతార మాట్లాడుతూ... కొత్త సంవత్సరం నుంచి తెలుగులోనే మాట్లాడటానికి తప్పకుండా ప్రయత్నిస్తానని ఆమె ప్రామిస్ చేశారు. 'శ్రీరామరాజ్యం' తర్వాత 'కృష్టం వందే...'లో తనకు మంచి పేరొచ్చినందుకు ఆనందంగా ఉందని, ఈ సినిమాను ప్రజలు బాగా ఆదరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నానని ఆమె తెలిపారు.

అలాగే ''ఒక నటిగా నా కెరీర్‌లో చాలా సినిమాలున్నాయి. అందులో కొన్ని కథలు మాత్రం పదే పదే గుర్తుకొచ్చి మనసుపై ప్రభావం చూపుతుంటాయి. అలాంటివాటిలో 'కృష్ణం వందే జగద్గురుమ్‌' ఒకటి'' అని చెప్పింది నయనతార. ''ఈ సినిమా విషయంలో దర్శకుడు క్రిష్‌ నాపై ఉంచిన నమ్మకమే నన్ను ముందుకు నడిపించింది. ఇందులో దేవిక పాత్రకు డబ్బింగ్‌ చెప్పాలన్నప్పుడు నిజంగా భయమేసింది. నేను చెప్పగలనా? అని సందేహించాను. ఆ విషయంలో నన్ను దర్శకుడు విశ్వసించారు. నువ్వు చెప్పగలవు అని ప్రోత్సహించారు. ఆ ధైర్యంతోనే డబ్బింగ్‌ చెప్పా. చాలా రోజులుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నా. తెలుగు బాగా అర్థమవుతుంది. కానీ మాట్లాడలేను. ఇప్పుడు ఆ సమస్య చాలా వరకూ తీరింది. రానా మంచి సహ నటుడు. తను సెట్‌లో అందరితోనూ కలివిడిగా నడుచుకొంటాడ''న్నారు.

రానా మాట్లాడుతూ ''ఒక మంచి కథలో నటించాలనే కోరిక చాలా రోజులుగా ఉండేది. అది ఈ సినిమాతో నెరవేరింది.ఈ సినిమాతో 'కమర్షియల్ డెరైక్టర్'గా క్రిష్ పేరు తెచ్చుకున్నారు''అన్నారు.మంచి సినిమా తీస్తే ప్రజలు ఆదరిస్తారని ఈ సినిమా ద్వారా మరోసారి ప్రూవ్ అయిందని క్రిష్ చెప్పగా, 'డ్రైవింగ్' రాని తనతో 'టాక్సీ డ్రైవరు పాత్ర' డెరైక్టరు చేయించారని పోసాని కృష్ణమురళి చెప్పారు. ఈ సినిమాకు 'వెన్నెముక'గా మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ నిలిచారని ప్రతిఒక్కరూ ఆయనను ప్రత్యేకించి ప్రస్తుతించారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన వై.రాజీవ్‌రెడ్డి కూడా సినిమా సక్సెస్‌పట్ల ఆనందం వ్యక్తపరిచా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X