బాలయ్య 'సింహా' చిత్రంలో నయనతార పాత్ర...
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రెడీ అవుతున్న సింహా చిత్రంలో నయనతార మూడో హీరోయిన్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర గురించి దర్శకుడు బోయపాటి శ్రీను చెబుతూ - "ఈ ఫ్లాష్‌బాక్‌లో వచ్చే ఎపిసోడ్‌లో విరోచిత భావాలు పలికించే హీరోయిన్ కోసం చాలామందిని అనుకున్నాం. అయితే నయనతార బాగుంటుందని ఆమెనే ఎంపికచేశాం. ఈరోజు హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిపిన షూటింగ్‌తో ఇక్కడి షెడ్యూల్ పూర్తయ్యింది. ఆ తర్వాత వైజాగ్, బొబ్బిలి, విజయనగరం, వరంగల్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నాం అన్నారు.
ఇక బాలయ్య సరసన నయనతార, నమిత, స్నేహా ఉల్లాల్ తొలిసారి జత కట్టిన చిత్రం ఇది. ఇప్పటివరకు జరిపిన షూటింగ్‌తో 60 శాతం సినిమా పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో బాలకృష్ణ కొత్త కోణంలో కనిపిస్తారు. ఆయన శారీరక భాష కూడా వైవిధ్యంగా ఉంటుంది. అలాగే ఈ చిత్రానికి చక్రి అందించిన పాటలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. జనవరి 10వరకు జరిపే షెడ్యూల్‌తో టాకీతోపాటు మూడు పాటల చిత్రీకరణ పూర్తవుతుంది. మిగిలిన 2 పాటలను అదే నెల 16 తర్వాత "కథానుసారం నయనతార యాప్ట్‌గా ఉంటుందని యూనిట్ అంతా ఏకగ్రీవంగా ఆమోదించిన మేరకు తనని ప్రధాన నాయికగా తీసుకున్నాం.బాలకృష్ణ చిత్రాల న్నింటిలోకెల్లా ఇది ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది' అని చెప్పారు.
"ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ కొత్తగా ఉంటుంది. స్టన్ శివ, రామ్ లకణ్ లు ఈ ఫైట్‌లు సమకూరుస్తున్నారు. అలాగే 'సింహా' అనే టైటిల్ బాలయ్య పోషిస్తున్న పాత్ర పేరు నుంచి వచ్చిన పదం. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం' అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహేంద్రబాబు అన్నారు. కె.ఆర్.విజయ, మలయాళ నటుడు సాయికుమార్, ఆనందభారతి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











