నయనతార డిమాండ్: మాజీ ప్రియుడితో రూ. కోటిపైనే?

By Bojja Kumar

చెన్నై: హీరోయిన్ నయనతార సౌత్‌లో చాలా ఖరీదైన హీరోయిన్‌గా మారుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి రాజా రాణి, ఆరంభం చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తోంది. నెక్ట్స్ తన మాజీ ప్రియుడు శింబుతో చేస్తున్న సినిమాకు రూ. 1.25 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే తమిళ ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం....నయనతార రూ. 1.25 కోట్లు డిమాండ్ చేయడంలో ఆశ్చర్యమేమీ లేదని అంటున్నారు. రాజారాణి, ఆరంభం లాంటి చిత్రాల సక్సెస్ తర్వాత ఆ మాత్రం ఇవ్వడం సబబే అంటున్నారు. హీరోలతో పొల్చితే ఇదేమీ పెద్ద మొత్తం కాదని అంటున్నారు.

మరో వైపు కొందరు నిర్మాతలు కూడా నయనతార అడిగిన మొత్తం ఇవ్వడానికి సిద్ధపడుతుండటం గమనార్హం. నయనతార పెర్ఫార్మెన్స్ పరంగా, గ్లామర్ పరంగా నిర్మాతలకు, దర్శకులకు అనుకూలంగా పని చేయడమే ఇందుకు కారణమని అంటున్నారు. మిగతా వివరాలు స్లైడ్ షోలో...

నయనతార, శింబు

నయనతార, శింబు


నయనతార ఇంత భారీ మొత్తం డిమాండ్ చేయడానికి కారణం విడిపోయిన తన మాజీ ప్రియుడు శింబుతో కలిసి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సి రావడం వల్లనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

గతంతో ఘాటు ప్రేమాయణం

గతంతో ఘాటు ప్రేమాయణం


నయనతార, శింబు మధ్య గతంలో ఎఫైర్ నడించింది. ప్రేమలో ఉండటంతో ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ రొమాన్స్ అప్పట్లో తెరపై బాగా పండాయి. అయితే వీరు విడిపోయిన తర్వాత మళ్లీ కలిసి నటించలేదు.

భారీ మొత్తం వల్లే ఒప్పుకుందా?

భారీ మొత్తం వల్లే ఒప్పుకుందా?


తన మాజీ ప్రియుడితో దాదాపు 7 ఏళ్ల తర్వాత నటించడానికి ఒప్పుకోవడం నయనతార అడిగిన మొత్తం నిర్మాతలు ఆఫర్ చేయడం వల్లనే అనే వాదన వినిపిస్తోంది.

అందరిలోనూ ఆసక్తి

అందరిలోనూ ఆసక్తి


మాజీ ప్రేమికులైన నయనతార-శింబు మళ్లీ కలిసి నటిస్తున్నారను అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనడం సహజం. పైగా ఇద్దరూ మంచి ఫాంలో ఉన్నవారే.

పాండిరాజ్ దర్శకత్వం

పాండిరాజ్ దర్శకత్వం


తమిళంలో తెరకెక్కుతున్న చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయినట్లు దర్శకుడు వెల్లడించారు. గతంలో నయనతార-శింబు కలిసి నటించిన వల్లభన్(తెలుగులో ‘వల్లభ') చిత్రంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X