సినిమా ఫీల్డ్ వదిలేసే విషయమై నయనతార క్లారిఫికేషన్
గత కొద్ది రోజులుగా నయనతార ఇక సినిమాలను వదిలేసి పెళ్లై సెటిల్ అయ్యే ఆలోచనలో ఉందనే వార్తలు మీడియాలో కంటిన్యూగా వస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరం ఆఖరికి ఆమె ప్రభుదేవాని పెళ్ళాడనుకోవటం కోసమే ఈ నిర్ణయం తీసుకుందని, అందుకునే కొత్త సినిమాలు ఒప్పుకోవటం లేదని వినిపించింది. అయితే ఇవన్నీ రూమర్స్ అని కొట్టి పారేస్తోంది నయనతార. ఆమె మాట్లాడుతూ..నేను ప్రస్తుతం కన్నడ, మళయాళ చిత్రాల షూటింగ్ లలో బిజీగా ఉన్నాను. ఒక్కసారి అవి ఫినిష్ అయిపోయాక, తెలుగు, తమిళ ప్రాజెక్టులు సైన్ చేస్తాను. ఇక నా పర్శనల్ జీవితం గురించి ఈ సిట్యువేషన్ లో ఏమీ మాట్లాడను. అలాగే నేను కొత్త సినిమాలు ఒప్పుకుంటానా లేదా అనేది కంప్లీట్ గా నా నిర్ణయం మాత్రమే. ఇప్పుడు ఏ స్టేట్ మెంట్ ఇవ్వదలచుకోలేదు. టైమ్ వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడతాను అంది.


Click it and Unblock the Notifications











