పెళ్లి కోసం మతం మార్చుకున్న నయనతార
సినీనటి నయనతార మతం మార్చుకుంది. దర్శకుడు, నటుడు పభుదేవాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఆమె తన ప్రియుడి కోసం తన ఇంత కాలం కొనసాగిన క్రైస్తవ మతం వదిలి పెట్టింది. ఈ మేరకు.... చెన్నయ్ లోని ఆర్యసమాజంలో ఆదివారం వేదపండితుల ఆద్వర్యంలో హిందూ మతం స్వీకరించింది. నయన మతం మార్పిడి సంగతి సర్వత్రా చర్చనీయాంశ మైంది. నయన తార ఈ సంచలన నిర్ణయం వెనక ప్రభుదేవా ఒత్తిడి ఏమైనా పని చేసిందా? లేక నయన తార కావాలని ప్రభుదేవా కోసం మతం మార్చుకుందా? తెలియాల్సి ఉంది
వివాహితుడై ఇద్దరు పిల్లల తండ్రి అయిన పభుదేవా.... భార్యను కాదని నయనతో ప్రేమలో పడటం, కోర్టు వివాదాల అనంతరం చివరకు తన మొదటి భార్య రమలత్ తో విడాకులు తీసుకోవడం, తను మనసు పడ్డ నయన తారును రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











