చర్చిలో రహస్య పెళ్లి...స్పందించిన నయనతార

By Srikanya

హైదరాబాద్ : నిన్నంతా తమిళ మీడియా మొత్తం...నయనతారకి, తమిళ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌కి కొచ్చిలోని ఒక చర్చిలో రహస్య వివాహం జరిగిందంటూ కంటిన్యూగా వార్తలు ఇస్తూనే ఉంది. ఈ విషయమై ఎలర్టైన నయనతార వెంటనే స్పందించారు. ఈ వార్తలో నిజం లేదని, తన దృష్టి కేవలం సినిమాలపైనే ఉందని ఆమె స్పష్టం చేశారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అలాగే...పెళ్లనేది ప్రతి అమ్మాయి జీవితంలోనూ చాలా కీలకమైన ఘట్టమని, దానిని రహస్యంగా చేసుకోనని రాసుకొచ్చారు. ఒకవేళ నిజంగా చేసుకుంటే ప్రపంచానికి చెబుతానని ఆమె తెలిపారు. తనకు పెళ్లయ్యిందంటూ మీడియా వాళ్లు అనవసరంగా వార్తలు రాస్తున్నారనీ, కూల్ అవ్వాలనీ నయన్ అన్నారు. ప్రస్తుతం సినిమాలు తప్ప తన జీవితంలో ఏమీ లేవని కూడా చెప్పారామె.

Nayantara declines Marriage Rumours

ప్రస్తుతం నయనతార తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. వాటిలో విఘ్నేశ్‌ దర్శకత్వం వహిస్తున్న 'నానుం రౌడీ దాన్‌' ఒకటి. ఈ నేపథ్యంలో దర్శకుడు, నయనతార ప్రేమించుకున్నట్లు కొంత కాలంగా వార్తలొచ్చాయి. తాజాగా వీరు రహస్య వివాహం చేసుకున్నట్లు సోమవారం కొన్ని తమిళ పత్రికలు, వెబ్‌ సైట్లలో వార్తలు వెలువడ్డాయి.

నయనతార రహస్య వివాహం చేసుకున్నారా? ప్రస్తుతం తాను నటిస్తున్న 'నానుమ్ రౌడీదాన్' దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని ఆమె పెళ్లాడారా?... ఇలా సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ చెన్నైలో జోరుగా జరిగిన ఈ చర్చ హైదరాబాద్ వరకూ వచ్చేసింది. ఇంకేముంది? నయనతారకు పెళ్లయిపోయిందట అని సామాజిక మాధ్యమాల్లో వార్తలు జోరుగా విహారం చేశాయి. కానీ, ఆ వార్తల్లో నిజం లేదని నయనతార ఇలా పేర్కొన్నారు.

వీటిపై విఘ్నేశ్‌ కూడా స్పందిస్తూ ''ఇలాంటి వార్తలు నా వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి ఇబ్బందికరం. అందుకే దీనికి సంబంధించిన విషయాలను ప్రచారం చేయడం మానుకోవాలి'' అని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X