బాలకృష్ణ సరసన సీత పాత్రకో నో చెప్పిన నయనతార
బాపు దర్శకత్వంలో రూపొందుతున్న రామరాజ్యం సినిమాలో బాలకృష్ణ సరసన నయనతార సీతగా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్త ఫిల్మ్ నగర్ లో గుప్పుమంది. వెంటనే నయనతార తన వాదనను వినిపించింది. ఆ వార్తను నయనతార సన్నిహిత వర్గాలు కొట్టిపారేశాయి. ఆ పాత్ర కోసం చాలా కాలం క్రితం నయనతారను అడిగిన విషయం నిజమేనని, ఆ పాత్రను నయనతార పోషిస్తున్నట్లు వార్తలు వ్యాపించాయని, అందులో నిజం లేదని ఆ వర్గాలు చెప్పాయి. నిజానికి, తాను సీత పాత్రకు అంగీకరించలేదని చెప్పడానికి నయనతారనే మీడియా ముందుకు రావాల్సి ఉంది. అయితే, అందుకు ఆమె భయపడిందట. ప్రభుదేవాతో తన పెళ్లి గురించి మీడియా అడుగుతుందనే భయంతో ఆమె మీడియా ముందుకు రాలేదని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











