ఒంటరైన నయనతార లైఫ్‌లో మరో వ్యక్తి? (ఫోటో ఫీచర్)

By Bojja Kumar

హైదరాబాద్: హీరోయిన్ నయనతార సినిమా జీవితం గురించి...వ్యక్తిగత జీవితం గురించి అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న ఆమె పర్సనల్ లైఫ్ కూడా ఎంతో ఆసక్తికరం. తొలుత శింబుతో ప్రేమాయణం, ఆ తర్వాత ప్రభుదేవాతో సహజీవనం.....ఇద్దరితోనూ విడిపోయి ప్రస్తుతం ఒంటరి జీవితం.

అయితే తాజాగా నయనతార గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ నటుడు గణేష్ వెంకట్రామన్‌తో ఆమె సన్నిహితంగా మెలుగుతుండటంతో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరూ జయం రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'తాని ఒరువన్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇద్దరి మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం పలు సందేహాలు రేకెత్తించడంతో పాటు ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారనే రూమర్లకు కారణమవుతోంది.

రీమేక్ సినిమాల కింగుగా జయంరాజాకు పేరుంది. అయితే ఈ సారి జయంరాజా ఈ సారి రీమేక్ కాకుండా ఒరిజినల్ స్టోరీతో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో జయం రాజా సోదరుడు జయం రవి, గణేష్ వెంకట్రామన్, నయనతార లీడ్ రోల్స్ చేస్తున్నారు. సాధారణంగా ఏ సినిమా విషయం తీసుకున్నా....అందులో నటించే హీరో హీరోయిన్ల మధ్య పుకార్లు షికార్లు చేస్తాయి. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం భిన్నం. హీరోయిన్ నయనతార, సెకండ్ హీరో గణేష్ వెంకట్రామన్ గురించిన వార్తలు వినిపిస్తున్నాయి.

రెండు సార్లు ప్రేమలో విఫలం అయి ప్రస్తుతం ఒంటరి జీవితం గడుపుతున్న నయనతార.....గణేష్ వెంకట్రామన్‌కు దగ్గరవుతోందని, అతనితో సాన్నిహిత్యం పెంచుకుంటోందని, స్నేహంగా మొదలైన వీరి బంధం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే చర్చ తమిళ సినీ వర్గాల్లో సాగుతోంది.

2010లో దిగిన ఫోటో...

2010లో దిగిన ఫోటో...

గణేష్ వెంకట్రామన్, నయనతార మధ్య చాలా కాలంగా పరిచయం ఉంది. ఇద్దరి మధ్య స్నేహం ఉంది. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు.

లోకులు కాకులు

లోకులు కాకులు

ఇద్దరు సన్నిహితంగా ఉండటంపై జనాలకు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే వారు ఇవేమీ పట్టించుకోవడం లేదు. లోకులు కాకులు...వాళ్లు అలానే అరుస్తారు అనే విధంగా లైట్ తీసుకుంటున్నారు.

నయనతార సీరియస్ రిలేషన్ షిప్స్

నయనతార సీరియస్ రిలేషన్ షిప్స్

నయనతార చుట్టు ఇలాంటి రూమర్స్ రావడం కొత్తమే కాదు. ఆమె ఏ సినిమాలో నటించినా......ఇలాంటి ఎఫైర్ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

నయనతార-శింబు

నయనతార-శింబు

నయనతార-శింబు గతంలో పీకల్లోతు ప్రేమలో మనిగితేలారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. చాలాకాలం పాటు ఇద్దరూ కలిసి నటించలేదు. అయితే ఇపుడు అన్నీ మరిచిపోయి మళ్లీ ఓ సినిమాలో కలిసి నటిస్తున్నారు.

నయనతార-ప్రభుదేవా

నయనతార-ప్రభుదేవా

శింబుతో విడిపోయిన తర్వాత నయనతార దర్శకుడు, కొరియోగ్రాఫర్ అయిన ప్రభుదేవాకు దగ్గరైంది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X