పర్సనల్ మేకప్ మేన్ కి గోల్ట్ రింగ్ ఇచ్చిన నయనతార..!?

By Sindhu

ఒక సినిమా షూటింగ్ పూర్తయిన చివరి రోజు ఇక ఆ యూనిట్ సభ్యులకు పండగే. ఎందుకంటే, ఆయా హీరోలు, హీరోయిన్లు ఇన్నాళ్లూ తమతో గడిపి, తమకు కో- ఆపరేట్ చేసినందుకు కృతజ్ఞతగా యూనిట్ సభ్యులకు రకరకాల గిఫ్ట్ లు ఇస్తుంటారు. రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోలు కాస్త పెద్ద మొత్తంలోనే క్యాష్ గిఫ్టులిస్తుంటారు.

ఇదిలా ఉంచితే, మొన్న 'శ్రీరామరాజ్యం' షూటింగ్ చివరి రోజున కథానాయిక నయనతార కూడా యూనిట్ వాళ్లని గిఫ్టులతో సంతోషపరచింది. యూనిట్ కి మంచి వాచీలు గిఫ్ట్ గా ఇచ్చిందట. మొత్తం నూట ఏభైమంది యూనిట్ సభ్యులకి వాచీలిచ్చి థాంక్స్ చెప్పిందట. అలాగే, తన పర్సనల్ మ్యాకప్ మేన్ రాజూకి కొంత క్యాష్ తో బాటు గోల్డ్ రింగ్ కూడా గిఫ్ట్ ఇచ్చిందని తెలిసింది. ఇక ఇదే ఆమె చివరి చిత్రమని ఆమె స్టాఫ్ చెబుతున్నారు. తన ఆఖరి చిత్రం కావడంతో నయనతార ఈ విధంగా చేసిందా లేక 'శ్రీరామ రాజ్యం" చిత్రం తన కెరీర్ లో మంచి చిత్రంగా మిగిలిపోతుందనే ఆనందంలో ఈ విధంగా బహుమతులు పంచిందా అనే విషయం పక్కన పెడితే, ఇక్కడ నయనతారకు సినిమాలపై ఉన్నమంచితనం కనిపిస్తుందని అర్థం చేసుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X