తులసి సినిమాలో అందాలు ఆరబోసిన నయనతారకు ఫలితం దక్కింది. ఆ సినిమా విజయం సాధించడానికి కూడా నయనతార అందాలే ఎక్కువగా పనిచేశాయి. తొలి అర్థభాగం మొత్తం ఆమె గ్లామర్ చుట్టే సినిమా నడుస్తుంది. తులసి సినిమాలో గ్లామరస్ గా కనపడడమే కాకుండా ఇటీవల విడుదల అయిన బిల్లా తమిళ సినిమాలో బికినీలో నయనతార కనపడడం సంచలనం సృష్టించింది. ఈ విషయం ఆ నోట ఈ నోట నందమూరి బాలకృష్ణ చెవికి చేరాయి. ఆమె అందాలు ఆయనను ఆకర్షించాయి. ఆయన తదుపరి నటించబోతున్న సాధు సినిమాలో నయనతారను హీరోయిన్ గా చేశాయి. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమాకు హ్యారిస్ జయరాజ్ సంగీతాన్ని అందించనున్నారు. అందుకే అంటారు అందాలుంటే అవకాశాలు వాటంతటవే వస్తాయని.
Story first published: Wednesday, April 22, 2026, 5:10 [IST]