నాకు ఇంతకంటే ఏం కావాలి?: నయనతార

By Srikanya

హైదరాబాద్ : ఆ మధ్య పెళ్లి చేసుకుంటున్నానంటూ సినిమాలకు బై చెప్పేసిన నయనతార మళ్లీ ఊహించని విధంగా సీన్ లోకి వచ్చి బిజీ అయ్యింది. బిజీ అవ్వటమే కాక వరస హిట్స్ కొడుతోంది. తమిళంలో 'రాజా రాణి', 'ఆరంభం' సినిమాలతో వరుస విజయాలు అందుకొంది నయన్‌. తెలుగులో 'అనామిక'తో పాటు గోపీచంద్‌తో ఓ చిత్రం చేస్తోంది. ఈ నేఫద్యంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాక పట్టిందల్లా బంగారమే అన్నట్టుంది అని చెప్తోంది.

సెకండ్ ఇన్నింగ్స్ గురించి నయనతార మాట్లాడుతూ... ''చిత్ర పరిశ్రమకి నేనెప్పుడూ దూరం కాలేదు. అందుకే కెరీర్‌ని మళ్లీ కొత్తగా ప్రారంభించానని నాకెప్పుడూ అనిపించలేదు. అందరూ అంటున్నారు కాబట్టి నేను కూడా రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాననే చెబుతున్నాను. నాపై ప్రేక్షకులు ఎప్పట్లాగే ఆదరణ చూపిస్తుండడం మాటల్లో చెప్పలేనంత అనుభూతినిస్తోంది. దర్శకులకు కూడా నాపై మరింత నమ్మకం పెరిగిందేమో మరి. అందరూ ప్రాధాన్యమున్న పాత్రలను అప్పజెబుతున్నారు. ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?'' అని చెప్పుకొచ్చింది.

అలాగే... ''తొలినాళ్లల్లో చేతికొచ్చిన పాత్రలు చేస్తూ వెళ్లాను. వాటిలో ఏ పాత్ర ఎంత సంతృప్తినిచ్చిందంటే ఇప్పుడేమీ చెప్పలేను. అయితే కొంతకాలంగా మాత్రం అన్నీ మనసుకు నచ్చే పాత్రలే నా దగ్గరికి వస్తున్నాయి. వాటికోసం వెచ్చించే ప్రతీ క్షణం ఓ అపురూపం అనిపిస్తోంది''అంటోంది నయనతార. ఇక నయనతార ఇప్పుడు మరింత గ్లామర్‌తో కూడిన పాత్రల్ని కోరుకుంటోంది. ''కొంచెం బరువైన పాత్రల్ని పోషించానేమో అనిపిస్తోంది. అందుకే ఇప్పుడు అందం కొట్టొచ్చినట్టు కనిపించే పాత్రలు చేయాలనిపిస్తోంది'' అని చెప్పుకొచ్చింది నయన్‌.

''నిజం చెప్పాలంటే రెండో ఇన్నింగ్స్ లో ఇంతటి ఆదరణ నేను కూడా వూహించలేదు. చిత్ర పరిశ్రమ నన్నూ, నా పరిస్థితినీ అర్థం చేసుకొంది. సినిమాలకు స్వస్తి చెప్పినప్పుడు నా నిర్ణయాన్ని ఎంత గౌరవించారో, మళ్లీ రావాలి అనుకొన్నప్పుడు అంతగా ప్రోత్సహిస్తున్నారు. నా గురించి నేను ఆలోచించుకొనే తీరిక లేనంతగా షూటింగ్‌లతో మమేకమైపోయా. దర్శకుల నమ్మకాన్ని వమ్ము కానివ్వను'' అంది. అయితే నయనతార తన ఈ రీ ఎంట్రీ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కెరీర్ కి,పర్శనల్ లైప్ కి ముడి పెట్టకుండా కొనసాగాలని భావిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X