బాలకృష్ణ గురించి నయనతార కామెంట్
బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ లో బాపు రూపొందించిన శ్రీరామ రాజ్యం చిత్రం రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అందరికన్నా సీతగా వేసిన నయనతారకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణకే ఈ క్రెడిట్ మొత్తం దక్కుతుందన్నారు. ఆమె మాటల్లోనే... గతంలో మేమిద్దరం కలిసి సింహా సినిమాకి పనిచేసాం. శ్రీరామ రాజ్యం వంటి సినిమాలో చెయ్యటానకి ఆయనే కారణం. ఆయనే నేను సీత పాత్రకు న్యాయం చేయగలనని నమ్మి ఆ పాత్రను రికమెండ్ చేయటం జరిగింది. నేను కూడా రాముడు పాత్రలో వేరే వారిని ఊహించుకోలకపోతున్నాను అన్నారు. అలాగే నేను నా పుట్టిన రోజైన నవంబర్ 18న ఈ చిత్రాన్ని చూడటం జరిగింది. చెన్నైలోని ఫోర్ ఫ్రేమ్స్ ప్రివ్యూ ధియోటర్ లో ఈ సినిమా చూసాను. నిర్మాత ఎలమంచిలి సాయి బాబు గారు ఈ స్పెషల్ షోని నాకోసం ఎరేంజ్ చేసారు. మా స్టాఫ్, క్లోజ్ ప్రెండ్స్ కలిసి చూసాం.
శ్రీరామ రాజ్యం నా పుట్టిన రోజు బహుమతిగా భావిస్తున్నాను అంది. ఇక నాకు ఆ పాత్ర రాగానే నేను చాలా ఆనందం ఫీలయ్యాను.. అదే సమయంలో భయం కూడా పడ్డాను. ఎందుకంటే గతంలో అంజలీ దేవి వంటి గొప్ప ఆర్టిస్టు చేసిన పాత్రను నేను చేసి మెప్పించగలనా అనిపించింది. అయితే బాపు గారు దగ్గరుండి ధైర్యం చెప్పి, గైడ్ చేసి నా నుంచి ఎక్సప్రెషన్స్ రాబట్టి నిలబెట్టారు అన్నారు. ఇక ఇన్నాళ్లూ గ్లామర్ పాత్రలకే పరిమితం అనుకున్న ఆమె ఇలాంటి పాత్ర మెప్పించటం మామూలు విషయం కాదని అంతటా ప్రశంసలు అందటం తనకు ఆనందాన్ని కలుగచేస్తోందని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











