నయన్ ను భరిస్తారా??
తన మొదటి చిత్రమే సూపర్ స్టార్ రజనీ సరసన నటించడం, ఆ సినిమా అఖండ విజయాన్ని సాధించడంతో నయనతార రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయింది. అటుపై వచ్చిన చిత్రాలు కూడా విజయబాటను పట్టడంతో కోటి రూపాయల పారితోషికం డిమాండ్ చేసే స్థాయికి వచ్చింది. కానీ తమిళంలో 'బిల్లా' తరువాత ఒక్క హిట్టు కూడా రాక విలవిలలాడిపోతోంది. కనీసం తెలుగులో అయినా విజయలక్ష్మి ఆచూకీ దొరుకుతుందేమోనని ప్రయత్నించినా, ఆమె ధాటికి తట్టుకోలేక 'ఆంజనేయులు' సైతం బొక్కబోర్లా పడ్డాడు. అసలు సినిమా పరాజయానికి ప్రధాన కారణం నయనతారేనన్న ప్రచారం కూడా జరిగింది.
ఇక ప్రస్తుతం నయన్ ధాటిని తట్టుకోవడానికి ఎన్టీఆర్, 'గజిని' సూర్యలు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ సరసన 'అదుర్స్' చిత్రంలోనూ, సూర్య సరసన తమిళంలో 'ఆదవన్' చిత్రంలోనూ నటిస్తోంది. ఈ సినిమా తెలుగులో 'ఘటికుడు' గా వస్తోంది. కనీసం ఈ చిత్రాల్లో అయినా నయన్ అదరగొట్టి, ఘటికురాలు అనిపించుకుంటుందో లేక ఐరన్ లెగ్ అన్న ట్యాగ్ నే కొనసాగిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











