twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్: నయనతార భర్త మిస్సింగ్ (ఫోటో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : నయనతార భర్త అజయ్ శాస్త్రి మిస్సయ్యాడంటూ సౌత్ ఇండియా అంతటా పోస్టర్స్ కనిపిస్తున్నాయి. నయనతారకి ఇంకా పెళ్లే కాలేదు...ఆమె భర్త మిస్సవటమేమిటని ఆశ్చర్యపోతున్నారా...అసలు విషయమేమిటంటే... నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం 'అనామిక'. ఈ చిత్రం ప్రమోషన్ కోసం దర్శకుడు శేఖర్ కమ్ముల అనుసరిస్తున్న వ్యూహం ఇది. సినిమాలో ఆమె భర్తగా చేస్తున్నహర్షవర్ధన్‌ రాణే ఫోటోలను వేసి..పైన మిస్సింగ్ అని...క్రింద ఎత్తు,బరువు,కాంటాక్ట్ వివరాలు ఉంచారు.

    హిందీలో విజయవంతమైన 'కహానీ' సినిమా ఆధారంగా రూపొందుతోంది. అక్కడ విద్యాబాలన్‌ పోషించిన పాత్రలో ఇక్కడ నయనతార నటిస్తోంది. వైభవ్‌, హర్షవర్ధన్‌ రాణే కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఎండమోల్‌ ఇండియా, లాంగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌, సెలెక్ట్‌ మీడియా హోల్డింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి పలు రిలీజ్ డేట్స్ అనుకున్నారు కానీ ఫైనల్ గా ఈ చిత్రాన్ని పిభ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి నిర్ణియించుకున్నారని సమాచారం.

    నా దృష్టిలో ఇదొక ప్రత్యేకమైన చిత్రం. 'కహానీ' ఆధారంగా రూపొందుతున్న చిత్రమే అయినా... రెండింటిమధ్య ఏమాత్రం పోలికలు కనిపించవు. మన వాతావరణానికి తగ్గట్టుగా కథలో పూర్తిస్థాయిలో మార్పులు చేశారు శేఖర్‌ కమ్ముల. విద్యాబాలన్‌ పోషించిన పాత్రతో నా పాత్రని ఎవ్వరూ పోల్చి చూసుకోలేరు. అంత వైవిధ్యంగా ఉంటుంది. అందరినీ ఆకట్టుకొనే ఓ మంచి చిత్రమవుతుంది అంటూ నయనతార చెప్పుకొచ్చింది.

    నయనతార మాట్లాడుతూ ''స్త్రీ ప్రాధాన్యమున్న సినిమాలో నటించడం చాలా ఆనందాన్నిస్తోంది. అనామికగా కొత్త నయనతారని చూస్తారు. కహాని' సినిమాలో చాలా మార్పులు చేశారు. నా పాత్ర తీరుతెన్నులు కూడా మారాయి. నా శైలిలోనే నటించాను. ఎంత రీమేక్‌ అయినా మార్పులు, చేర్పులూ అవసరం. మక్కీకి మక్కీ తీస్తే చూడ్డానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఒక వేళ అలాంటి కథలే నాముందుకు వస్తే అంగీకరించను. శేఖర్‌ శైలి తెలుసు కాబట్టి, ఆయన మార్పులు నచ్చాయి కాబట్టి 'కహాని' ఒప్పుకున్నా'' అన్నారు.

    ''పెళ్త్లెన ఓ మహిళ నేపథ్యంలో సాగే కథ ఇది. ఆమె ఎవరి కోసం అన్వేషణ ప్రారంభించింది? జీవితంలో ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొంది? అనే విషయాలు ఆసక్తికరం. ఎం.ఎం.కీరవాణి స్వరాలు చిత్రానికి బలాన్నిస్తాయి''అని నిర్మాత చెబుతున్నాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విజయ్‌ సి.కుమార్‌.

    English summary
    Viacom18 Motion Pictures has kick started their promotions for new movie Anamika with unique concept of a missing poster of heroine Nayanthara’s on screen husband all across South India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X