వరస ఫ్లాపులతో ఉన్న నయనతార చాలా నిరాశలో ఉంది. అందులోనూ లింగుస్వామి దర్శకత్వంలో ప్రారంభమవుతుందనుకున్న సినిమా సైతం రెమ్యునేషన్ గొడవతో వెనక్కి వెళ్ళిపోయింది. మరో ప్రక్క తమిళ నిర్మాతల మండలిలో ఆమెపై ఇద్దరు నిర్మాతలు కంప్లైంయింట్ చేసారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఆమెకు పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ వచ్చిందని సమాచారం. పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రెడీ కానున్న ఆ సినిమాలో ఎంపిక అవటం ఆమెకు ఊరటే అని చెప్పవచ్చు. కమిడియన్ గణేష్ నిర్మించే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు.క ఈ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా జెనీలియాని తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. మరో ప్రక్క పవన్ తో మళ్ళి తెలుగునాట అడుగుపెడుతున్న ఆమెకు ఇక్కడ ఆదరణ బాగానే ఉంటుందనే నమ్మకం ఉంది. పేరున్న నిర్మాత,దర్శకులు,హీరోలతో ఆమె పర్శనల్ గా టచ్ లో ఉండటం వర్కవుట్ అయ్యే అంశం అంటున్నారు.
Story first published: Wednesday, December 17, 2008, 9:18 [IST]