నయనతో అలవాటయింది: జెనీలియా
పబ్బులు, పార్టీలు లాంటి ప్రదేశాలకు ఎక్కువగా నయనతారతో వెళ్లడం అలవాటయింది అంటోంది బబ్లీగర్ల్ జెనీలియా. మన హద్దుల్లో మనం ఉన్నంత వరకు ఇలాంటి ప్రదేశాలకు వెళ్లి రిలాక్స్ కావడంలో తప్పులేదంటోంది. నాకు ఎప్పుడైనా డిస్టర్బ్ గా అనిపిస్తే నేను రిలాక్స్ కోసం బయటకు వెలుతుంటాను. అలాంటి సమయాల్లో నాకు ముందుగా గుర్తు వచ్చే స్నేహితురాలు నయనతారే అంటోంది జెన్నీ. నయనతార కూడా నాకు అలాంటి స్థానమే ఇచ్చింది అని తన అంతరంలోని విషయాన్ని వెల్లడించింది. నయనతార-ప్రభుదేవ బంధం గురించి అడిగితే మాత్రం...అది వాళ్ల పర్సనల్, దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు అంటూ టాపిక్ డైవర్ట్ చేసి తనప ఇష్టాలు, అభిరుచుల గురించి చెప్పడం మొదలు పెట్టింది.
షూటింగ్ లేని సమయాల్లో ప్రశాంతత కోసం చర్చికి వెళతాను. ఎక్కవుగా జీన్స్, టీషర్టు ఇష్ట పడతాను. ఇక నా మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నవారు ఒకరున్నారు. అదే..నా పెంపుడు కుక్కపిల్ల సిలో. అదంటే నాకు ప్రాణం...అంటూ షరా మామూలుగా పలు విషయాలు చెప్పుకొచ్చింది. అన్నట్లు జెన్నీకి ట్విట్టర్లో 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారట. వీరిలో మళయాళ స్టార్ పృథ్వీరాజు కూడా ఉన్నారంటూ తెగ సంబర పడిపోతోంది ఈ చిలిపి పిల్ల.


Click it and Unblock the Notifications











