చివరాఖరికి...అభిమానుల కరుణించిన నయన!
నయనతార సినిమాలకు దూరం అవుతుందంటే...ఆమె అభిమానులు ఎంతో కృంగి పోయారు. ఇక తమ అభిమాన తారను చూడలేమేమో? అంటూ లోలోపల మదన పడిపోయారు. ఆమె అందాలు తెరపై చూసే భాగ్యం మాకు లేదా? అనుకుంటూ హాహాకరాలు పెట్టారు. అయితే ఎట్టకేలకు నయనతార అభిమానులను కరుణించినట్లే కనిపిస్తోంది. తాజాగా సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం నయన తార మళ్లీ సినిమాల్లో నటించడానికి సుముఖత చూపుతోందట. మంచి పాత్ర లభిస్తే నటిస్తానని అటు తమిళంలో, ఇటు తెలుగు దర్శక, నిర్మాతలకు కబురు పంపుతోంది.
ప్రభుదేవాని పెళ్లాడుతున్న నేపథ్యంలో....ఇకపై గ్లామర్ పాత్రలకు, ఎక్స్ ఫోజింగ్ సన్నివేశాలకు దూరంగా ఉండాలనే ఆలోచనలో నయనతార ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీరామ రాజ్యంలో సీత పాత్ర మాదిరి తన వ్యక్తిత్వ విలువను, తన హుందా తనాన్ని పెంచే పాత్ర దొరికితేనే నటిస్తానని తేల్చి చెబుతోందట ఈ తార.
కొరియో గ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవాతో పీకల్లోతు ప్రేమలో కూరుకు పోయిన నయనతార ప్రస్తుతం ఆయనతోనే సహజీవనం చేస్తోందనే వార్తలు సినీవర్గాల్లో వినిపిస్తోంది. 2012లో వీరి వివాహం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్ సినిమాలకు దర్శకత్వం వహిస్తూ బిజీగా గడుపుతున్నారు.


Click it and Unblock the Notifications











